రాష్ట్ర పోలీస్ క్రీడల్లో పోలీస్ అకాడమీకి 26 పతకాలు

రాష్ట్ర పోలీస్ క్రీడల్లో పోలీస్ అకాడమీకి 26 పతకాలు

గండిపేట, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని సరూర్‌‌‌‌నగర్ ఇండోర్ స్టేడియంలో జులై 7 నుంచి 9 వరకు జరిగిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్–క్లస్టర్–ఏ పోటీల్లో తెలంగాణ పోలీస్ అకాడమీ క్రీడాకారులు 26 పతకాలు సాధించి సత్తా చాటారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ నాయకత్వంలో, అసిస్టెంట్ డైరెక్టర్ టి.ఏ. భారత్ పర్యవేక్షణలో బరిలోకి దిగిన జట్టు వెయిట్‌‌‌‌లిఫ్టింగ్, యోగా, పెంచక్ సిలాట్, తైక్వాండో, ఆర్మ్ రెజ్లింగ్, బాడీబిల్డింగ్, రెజ్లింగ్ విభాగాల్లో 3 గోల్డ్​, 9 సిల్వర్​, 14 కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. 

కానిస్టేబుల్ వై. శ్రీను అత్యధికంగా ఏడు పతకాలు సాధించగా, పీసీ పరశురామ్ నాలుగు, ఏఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ ఆంజనేయులు మూడు పతకాలు గెలిచారు. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, ఏఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ వజ్రరెడ్డి, పీసీలు మాధూరి, పద్మావతి రెండేసి పతకాలు సాధించారు. డీఎస్పీ జగదీశ్వర్, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఏఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ సురేష్ తలో పతకం దక్కించుకున్నారు. విజేతలను డైరెక్టర్ అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.