TG20 లీగ్‎లో ఫైనల్‎కు దూసుకెళ్లిన ఖమ్మం

TG20 లీగ్‎లో ఫైనల్‎కు దూసుకెళ్లిన ఖమ్మం

హైదరాబాద్: టీజీ 20 లీగ్‌లో ఖమ్మం జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం రాత్రి  హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఖమ్మం 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.  బ్యాటింగ్ చేసిన ఖమ్మం నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 200 రన్స్​ చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్  190 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఖమ్మం బౌలర్లలో సహేంద్ర మూడు వికెట్లు తీయగా, వేదొడ్డి రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్, విద్యానందరెడ్డి, సీవీ మిలింద్ తలో వికెట్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.