క్వాలిఫయర్-2కు కరీంనగర్‌..‌‌‌‌‌ 75 పరుగుల తేడాతో రంగారెడ్డిపై ఘన విజయం

క్వాలిఫయర్-2కు కరీంనగర్‌..‌‌‌‌‌ 75 పరుగుల తేడాతో రంగారెడ్డిపై ఘన విజయం

హైదరాబాద్: టీజీ20 లీగ్‎లో భాగంగా గురువారం జరిగిన ఎలిమినేటర్‌‌‌‌లో కరీంనగర్ డైమండ్స్ 75 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌‌‌‌ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌‌‌‌తో మెరిశాడు. 

కేవలం 61 బంతుల్లో 11 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేసి ఈ సీజన్‌‌‌‌లో తన మూడో సెంచరీ నమోదు చేశాడు. వైస్ కెప్టెన్ సింహా 50 పరుగులతో రాణించగా, వీరిద్దరూ రెండో వికెట్‌‌‌‌కు 69 బంతుల్లో 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శుక్రవారం జరిగితే క్వాలిఫయర్​2లో   హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్ జట్లు తలపడనున్నాయి.  విజయం సాధించిన జట్టు ఫైనల్లో ఖమ్మంతో టైటిల్ పోరులో తలపడనుంది.