న్యూఢిల్లీ, వెలుగు: తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. బ్లాక్ కేటాయింపుపై తొలుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇప్పుడు ఈ బ్లాక్ ముందే రావాల్సింది అనడం సరికాదన్నారు.
2013లోనే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం లేఖ రాసినా అప్పటి కాంగ్రెస్ సర్కార్ కేటాయించలేదని, కానీ ప్రస్తుత మోదీ ప్రభుత్వం కార్మికుల భవిష్యత్తు కోసం ఈ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణిపై భారీ ఆర్థిక భారం పడిందని ఆరోపించారు.
