అమెరికాలో భార్య హత్య.. తెలంగాణ టెకీ అరెస్ట్

అమెరికాలో భార్య హత్య.. తెలంగాణ టెకీ అరెస్ట్

న్యూఢిల్లీ: అమెరికాలో భార్యను హత్య చేసిన తెలంగాణకు చెందిన 30 ఏండ్ల అవినాశ్ నార్నే అనే టెకీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారి అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఆమె మృతదేహం లభ్యమవ్వగా.. తొమ్మిది నెలల విచారణ తర్వాత నేరం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అవినాశ్ నార్నే తన భార్య రాజిత సబ్బినేని (27)ని గొంతు పిసికి హత్య చేసి, ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడాన్ని పోలీసులు నిర్ధారించారు.

అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న అవినాశ్ గత అక్టోబర్ 27న పోలీసులకు ఫోన్ చేసి తన భార్య లోపల నుంచి బాత్‌‌‌‌‌‌‌‌రూమ్ లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా పలకడం లేదని తెలిపాడు. స్పాట్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న పోలీసులు బాత్‌‌‌‌‌‌‌‌రూమ్ తలుపులు బద్దలు కొట్టి చూడగా, రాజిత నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె అప్పటికే మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు. 

అయితే, రాజితది సహజ మరణం కాదని, గొంతు నొక్కడం వల్లే ఊపిరాడక చనిపోయిందని పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ వచ్చింది.     ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు.. అవినాశ్‌‌‌‌‌‌‌‌కు భారత్‌‌‌‌‌‌‌‌లో ఒక యువతితో ఎఫైర్ ఉన్నట్టు తేల్చారు. 2025లో రాజితతో వివాహం జరిగిందని.. వివాహామైన తర్వాత కూడా ఆ రిలేషన్ కొనసాగించాడని గుర్తించారు. హత్య చేశాక భార్య మృతదేహం ఫొటోను కూడా అతడు తన ప్రియురాలికి పంపించినట్టు పేర్కొన్నారు.