న్యూఢిల్లీ: పరీక్షల ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన గురువారంతో 20వ రోజుకు చేరుకుంది. భారీ వర్షాల మధ్య కూడా నిరసన కొనసాగుతోంది. అయితే ఆందోళనకారులకు టార్పాలిన్లు ఏర్పాటు చేసుకునేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు.
ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ వీడియో రిలీజ్‌చేశాడు. విద్యార్థులంతా వర్షంలో తడిసి ఇబ్బంది పడుతున్నారని, పలువురు అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. రాత్రంతా వర్షం కురవడంతో పరుపులు, దుప్పట్లు తడిచిపోయాయని, స్టూడెంట్స్ నిద్ర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. పైఅధికారుల ఆదేశాలు వచ్చేవరకు స్టూడెంట్స్ వర్షంలోనే ఉండాలనడం అన్యాయమన్నారు.
