Vastu Tips:  ఆర్థిక ఇబ్బందులకు ఇంటి ముఖద్వారం కారణమా.. గర్భవతులు గృహప్రవేశం చేస్తే నష్టాలొస్తాయా?

Vastu Tips:  ఆర్థిక ఇబ్బందులకు ఇంటి ముఖద్వారం కారణమా.. గర్భవతులు గృహప్రవేశం చేస్తే నష్టాలొస్తాయా?

 ఇల్లు కట్టుకొనేటప్పుడు వాస్తు పద్దతులు పాటించాలి.  ప్రధాన డోర్​ ఎక్కడ ఉండాలి.. ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది.. ఇల్లు కట్టడం పూర్తయిన తరువాత భార్య గర్భవతిగా ఉంటే గృహప్రవేశం చేయవచ్చా.. మొదలగు విషయాల గురించి వాస్తు పండితులు ఇస్తున్న సూచనల గురించి తెలుసుకుందాం. . 

ప్రశ్న: మా ఇంటి ముఖద్వారం వాయువ్యం మూల పడమర దిక్కుకు ఉంది. అలా ఉండటం మంచిది కాదని కొందరు... పర్లేదు మంచిదే అని మరికొందరు అంటున్నారు. దానివల్లనో లేక మరే ఇతర కారణం వల్లనో తెలియదు కానీ, మేం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంత కష్టపడ్డా... ఎంత సంపాదించినా... అవసరమైనప్పుడు చేతిలో రూపాయి ఉండట్లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. మా బాధకు ఇంటి వాస్తు కారణమా? అసలు ప్రధాన ద్వారాలు ఎక్కడెక్కడ ఉంటే మంచిది? అసలు ఉండకూడని చోటు అంటూ ఉంటుందా?

జవాబు : ఇంటి ము ఖద్వారం వాయువ్యం మూల ఉత్త రం దిక్కుకు అసలు ఉండకూడదు. మీది పడమర దిక్కుకు ఉందంటున్నారు. కాబట్టి దానివల్ల ఎలాంటి వాస్తు దోషం ఉండదు. మీ సమస్యలకు కారణం ఒక్క ముఖద్వారం వాస్తు మాత్రమే అయ్యుండాలని లేదు కదా. అందుకే ముఖద్వారం కాకుండా మిగతా వాస్తు కూడా చూపించుకుంటే మంచిది. ప్రధాన ద్వారం చాలాచోట్ల పెట్టుకోవచ్చు. ఇంట్లో ముఖద్వారం పెట్టుకోవడానికి మొదట ప్రాధాన్యం ఇచ్చేచోటు... ఈశాన్యం మూల తూర్పు దిక్కు. అది అన్నింటినీ కలసి వస్తుంది. దాని తర్వాత ప్రాధాన్యం ఇచ్చేది మాత్రం అదే మూల ఉత్తరం దిక్కు. ఈ రెండింటి తర్వాత మీ ఇంటి ముఖద్వారం ఉన్న వాయువ్యం మూల పడమర దిక్కు. ఇవేవీ కుదరకపోతే... మధ్య తూర్పు, మధ్య దక్షిణం, మధ్య పడమర, మధ్య ఉత్తరం, ఆగ్నేయం మూల తూర్పు, దక్షిణం దిక్కులకు పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరి వీలును బట్టి ఈ చోట్లలో ముఖద్వారాలను పెట్టుకోవచ్చు.

►ALSO READ | Valentine Day : రిలేషన్ పై వర్రీ వద్దు.. డిప్రెషన్ అసలే వద్దు.. ఇలా బయటకు రండి.. 

ప్రశ్న: గృహప్రవేశం చేసేటప్పుడు కచ్చితంగా ఆ ఇంటి దంపతులు ఉండాల్సిందేనా?  చాలామంది గర్భవతిగా ఉన్నప్పుడు గృహప్రవేశం చేయొద్దంటున్నారు. మా కొత్త ఇల్లు కట్టడం పూర్తయింది. గృహప్రవేశం చేయాలనుకునే సరికి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాపట్లేదు. వేరే వాళ్లతో ఆ కార్యక్రమాన్ని జరిపించొచ్చా? లేదంటేనేను డెలివరీ అయ్యేవరకు ఆ ఇంటిని అలాగే వదిలేయాలా? మా సమస్యకు పరిష్కారం చెప్పండి.

జవాబు : ఎప్పుడైనా గృహప్రవేశం అనేది ఆ ఇంట్లో ఉండాల్సిన దంపతులే చేయాలి. ఇతరులతో చేయించకూడదు. కాకపోతే తండ్రి కట్టించిన ఇంటిని కొడుకు, కొడుకు కట్టుకున్న ఇంటిని తండ్రితో గృహప్రవేశం చేయించొచ్చు గర్భవతులు ఆరు నెలల లోపు వరకు గృహప్రవేశం చేయొచ్చు. . ఒక్క గృహప్రవేశమే కాదు. ఇంటి శంకుస్థాపన కూడా ఆరు నెలల లోపైతే చేయొచ్చు.