- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటపై సర్కార్ పగబట్టి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే పనులన్నీ ఆపేశారని, వెటర్నరీ కాలేజీని తరలించుకుపోయారని విమర్శించారు.
గత పదేళ్లలో సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఓర్వడం లేదన్నారు. అంతకు ముందు సిద్దిపేటలో అమర్ నాథ్ సేవా సమితి భవన నిర్మాణ పనులను హరీశ్‌రావు పరిశీలించి మొదటి అంతస్తూ స్లాబ్ పనులను ప్రారంభించి సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో ప్రీమియర్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
