పార్టీ ఫండ్ అంటే బీజేపీకే ఇస్తున్నారు.. 365 రోజుల్లో.. రూ.3 వేల 826 కోట్లు.. 82 శాతం వీళ్లదే..!

పార్టీ ఫండ్ అంటే బీజేపీకే ఇస్తున్నారు.. 365 రోజుల్లో.. రూ.3 వేల 826 కోట్లు.. 82 శాతం వీళ్లదే..!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ఏంటీ.. అధికారంలో ఉంటే డబ్బుకు లోటా ఏంటీ అన్నట్లు ఉంది దేశంలో భారతీయ జనతా పార్టీ. రాజకీయ పార్టీలకు ఫండ్స్.. నిధులు ఇవ్వటం కామన్.. అన్ని పార్టీలకు ఇస్తుంటారు.. ఇప్పుడు అంతా భిన్నం.. అందరూ బీజేపీ పార్టీకే ఇస్తున్నారు.. పార్టీ ఫండ్ అంటే ఫస్ట్ బీజేపీనే.. రాజకీయ పార్టీలకు రూపాయి ఫండ్ ఇవ్వాలంటే.. రూపాయలో.. 82 పైసలు బీజేపీకి.. మిగతా 18 పైసలు ఇతర పార్టీలకు ఇస్తున్నారు పారిశ్రామికవేత్తలు. ఈ ఫండ్స్ ఎంతలా ఉన్నాయి అంటే.. జస్ట్ 365 రోజుల్లో.. ఒకే ఒక్క ఏడాదిలో.. బీజేపీ పార్టీకి 3 వేల 157కోట్ల రూపాయల పార్టీ ఫండ్ వచ్చింది.. ఇది ఆల్ టైం రికార్డ్..

గత ఆర్థిక సంవత్సరం 2024–25లో ఎలక్టోరల్ ట్రస్టులు రూ.3,826 కోట్లు విరాళాలు అందుకున్నాయి. వచ్చిన ఈ మొత్తం నిధులను ట్రస్టులు రాజకీయ పార్టీలకు పంపిణీ చేసినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్టు పేర్కొంది. నిబంధనల మేరకు ట్రస్టులు తమకు వచ్చిన నిధుల్లో 95% నిధులను పార్టీలకు చెల్లించాల్సి ఉంటుంది. నమోదైన ట్రస్టులు 20 ఉండగా 10 మాత్రమే విరాళాలు అందుకున్నట్టు ప్రకటించాయని మిగతావి వివరాలు వెల్లడించలేదన తెలిపింది. 

Also Read : బ‌‌‌‌డ్జెట్ తొలి విడత సెష‌‌‌‌న్ కు ముగింపు

ఎన్నికల కమిషన్‌‌‌‌కు ఇచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించి రిపోర్టును రూపొందించినట్టు ప్రకటించింది. మొత్తం ట్రస్టులు అందుకున్న విరాళాలు రూ.3,826 కోట్లు కాగా ఇందులో బీజేపీ పార్టీకి ఒక్కదానికే అత్యధికంగా రూ.3,157 కోట్లు వచ్చాయి. ఇది మొత్తం వచ్చిన ఫండ్స్​లో 82 శాతం కావడం గమనార్హం. కాంగ్రెస్‌‌‌‌కు రూ.298 కోట్లు, అంటే కేవలం ఏడు శాతం వచ్చాయి. అలాగే తృణమూల్ కాంగ్రెస్‌‌‌‌కు రూ.102 కోట్లు. మిగతా పార్టీలకు రూ.267 కోట్లు అందాయి.

రూ.2,668 కోట్లు ఇచ్చిన ప్రూడెంట్​  ట్రస్ట్

ప్రూడెంట్ ట్రస్ట్  అత్యధికంగా రూ.2,668 కోట్లను 15 పార్టీలకు ఇచ్చింది. ప్రోగ్రెసివ్  ట్రస్ట్ రూ.914 కోట్లను మొత్తం 10 పార్టీలకు చెల్లించింది. అలాగే 228 కంపెనీలు మొత్తం రూ.3,636 కోట్లు ఇచ్చాయి. 99 మంది వ్యక్తులు రూ.187 కోట్లు చందాలు ఇచ్చారు. టాప్ 10 మంది దాతలు 49 శాతం ఇవ్వడం గమనార్హం. ఎలివేటెడ్ అవెన్యూ కంపెనీ రూ.500 కోట్లు ఇచ్చి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. టాటా సన్స్ రూ.308 కోట్లు, టీసీఎస్ రూ.217 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ రూ.175 కోట్లు ఇచ్చాయి. మాన్యుఫాక్చరింగ్​ సెక్టార్ నుంచి 27 శాతం, రియల్ ఎస్టేట్ నుంచి 16 శాతం, ఐటీ నుంచి 11 శాతం విరాళాలు వచ్చాయి. 

రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర నుంచి రూ.1,225 కోట్లు, తెలంగాణ నుంచి రూ.358 కోట్లు రాగా.. హర్యానా, బెంగాల్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే రూ.1,065 కోట్ల చందాలకు ఎలాంటి అడ్రస్​ లేదు. మరోవైపు కొన్ని ట్రస్టులు విరాళాలు రాలేదని చెప్పాయి. ఐదు ట్రస్టుల రిపోర్టులు ఇవ్వలేదు. హార్మొనీ ట్రస్ట్ తాను అందుకున్న మొత్తం దానికంటే ఎక్కువగా ఇచ్చింది. 2013లో ఈ ట్రస్టులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.