అమెరికాలో భారత విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. కర్ణాటకకు చెందిన బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య(22) ఫిబ్రవరి 9 నుంచి అదృశ్యం అయ్యాడు.
అతడు చివరగా బర్క్ లీ హిల్స్ లోని లేక్ అంజా సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. సాకేత్ కోసం అతడి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. దీనిపై అక్కడి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
►ALSO READ | గాలిలో పేలిన విమానం ఇంజన్.. ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
బర్కిలీ పోలీసుల వివరాల ప్రకారం.. సాకేత్ టిల్డెన్ రీజినల్ పార్క్ పక్కన ఉన్న పార్క్ హిల్స్ సమీపంలో ఓ ఇంటి గుమ్మం దగ్గర అతని పాస్ పోర్టు,ల్యాప్ టాప్ లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శ్రీనివాసయ్య చివరిసారిగా మెక్‌గీ అవెన్యూ సమీపంలోని డ్వైట్ వేలోని 1700 బ్లాక్‌లో కనిపించాడని పోలీసులు తెలిపారు. శ్రీనివాసయ్య గురించి ఎవరికైనా సమాచారం ఉంటే స్థానిక పోలీసు అధికారులకు తెలియజేయాలని బర్కిలీ పోలీసులు కోరారు.
