అబూజా: నైజీరియాలో ఓ విమానం గాలిలో ప్రయాణిస్తుండగా ఇంజన్ పేలిపోయింది. దీంతో విమానాన్ని పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్యాసింజర్లు ఉండగా, అందరూ సేఫ్‌గా బయటపడ్డారు.
అరిక్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737700 విమానం బుధవారం ఉదయం నైజీరియాలోని లాగోస్ నుంచి పోర్ట్ హార్కోర్ట్‌కు బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత విమానం 27 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఎడవైపు ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. జెట్ ఇంజన్ పేలిపోయి, విమానం కూడా స్వల్పంగా ధ్వంసమైంది.
