CHAMPION Box Office: వసూళ్ల వేటలో ‘ఛాంపియన్’ దూకుడు.. 2 డేస్ బాక్సాఫీస్ ఎంతంటే?

CHAMPION Box Office: వసూళ్ల వేటలో ‘ఛాంపియన్’ దూకుడు.. 2 డేస్ బాక్సాఫీస్ ఎంతంటే?

హీరో రోషన్ నటించిన "ఛాంపియన్" మూవీ వసూళ్ల దూకుడు కొనసాగిస్తోంది. పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘ఛాంపియన్’ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజే (డిసెంబర్ 25న) రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో రెండో రోజు సైతం బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లు రాబడుతుంది.

లేటెస్ట్గా ఛాంపియన్ రెండు రోజుల వసూళ్ల వివరాలు వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 6.91 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు. ‘‘ప్రేక్షకులతో థియేటర్లను నింపిన మీ అందరికీ ధన్యవాదాలు. ఛాంపియన్ 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 6.91 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇది ప్రజల ఛాంపియన్..’’ అని మేకర్స్ ట్వీట్ చేశారు. 2 రోజుల్లోనే దాదాపు రూ.7కోట్ల గ్రాస్ సాధించడం వసూళ్ల వేటకు మంచి ఊతం ఇచ్చింది. 

ALSO READ : సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్‌ దాఖలు.. 

ట్రేడ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం.. ఛాంపియన్ రెండు రోజుల్లో ఇండియా వైడ్గా రూ.4కోట్లకు పైగా నెట్ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలిరోజు డిసెంబర్ 25న రూ.2 కోట్ల 75 లక్షల నెట్, రెండో రోజు రూ.1.5 కోట్ల నెట్ చేసినట్లు  తెలిపాయి. ఇదే దూకుడు ఈ వీకెండ్ కొనసాగితే.. బాక్సాఫీస్ దగ్గర రోషన్ క్లిక్ అవ్వడం కన్ఫమ్ అని నిపుణులు భావిస్తున్నారు.

ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా రూ. 2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అటు ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని కేవలం స్పోర్ట్స్ డ్రామాగానే కాకుండా, 1980ల నాటి పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా మలిచిన తీరు అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ తనయుడిగా కాకుండా, తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రోషన్‌కు ‘ఛాంపియన్’ ఒక మేజర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ నిర్మాణ విలువలు సినిమాను విజువల్ వండర్‌గా మార్చాయి. ముఖ్యంగా మలయాళ బ్యూటీ అనస్వరా రాజన్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మిక్కీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా క్లైమాక్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ సన్నివేశాల్లో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.