ఎమోషనల్ రైడ్‌‌లా కపుల్ ఫ్రెండ్లీ 

ఎమోషనల్ రైడ్‌‌లా కపుల్ ఫ్రెండ్లీ 

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’.  వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి  14న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతోంది.  ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు.  గురువారం హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన   డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ  ‘ఈ మూవీ  ట్రైలర్ చాలా బాగుంది.  ఎమోషనల్ రైడ్‌‌లా  ఉంది.  

పర్ఫెక్ట్   టైమ్‌‌కు పర్ఫెక్ట్  జానర్‌‌‌‌లో వస్తున్న చిత్రమిది’ అని టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. హీరో శ్రీవిష్ణు, దర్శకులు మేర్లపాక గాంధీ, నందినీ రెడ్డి, అభిలాష్ రెడ్డి, నిర్మాత స్వప్నాదత్ కూడా అతిథులుగా హాజరై ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు. సంతోష్ శోభన్ మాట్లాడుతూ ‘మంచి క్యారెక్టర్స్, ఎమోషన్, హ్యూమర్ ఉన్న చిత్రమిది. సింపుల్ బ్యూటిఫుల్ మూమెంట్స్‌‌తో  ఆకట్టుకుంటుంది’ అని అన్నాడు. ఇదొక యంగ్, ఫ్రెష్ లవ్ డ్రామా అని మానస వారణాసి చెప్పింది. తామంతా హానెస్ట్‌‌గా చేసిన చిత్రమని, ఎవర్నీ  నిరాశపరచదని డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ చెప్పాడు.  ఈ టైమ్‌‌లో వస్తున్న అరుదైన ప్రేమ కథ ఇదని ధీరజ్ మొగిలినేని అన్నారు.