మార్కండేయ మిస్టిక్ థ్రిల్లర్ 

మార్కండేయ మిస్టిక్ థ్రిల్లర్ 

యంగ్ టాలెంట్‌‌ను  ఎంకరేజ్  చేసేందుకు  దిల్ రాజు డ్రీమ్స్  అనే కొత్త  బ్యానర్‌‌‌‌ను స్టార్ట్ చేశారు దిల్ రాజు.   ఈ బ్యానర్‌‌‌‌పై  తొలి చిత్రంగా  హీరో విక్రాంత్‌‌తో ‘మార్కండేయ’  నిర్మిస్తున్నారు.  ‘సంతాన ప్రాప్తిరస్తు’ తర్వాత విక్రాంత్ హీరోగా నటిస్తున్న చిత్రమిది.  మైథలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సిస్ట్లా వీఎంకే రూపొందిస్తున్నాడు. గురువారం టైటిల్ గ్లింప్స్‌‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘23 ఏళ్లలో 60 చిత్రాలు కంప్లీట్ చేసిన మా ఎస్వీసీ సంస్థకు దిల్ రాజు డ్రీమ్స్ అనేది మరో విభాగం.  మేము స్టార్స్‌‌తో పది సినిమాలు చేస్తే అందులో రెండు సినిమాలు ఆదరణ పొందలేదు.  మిడ్ రేంజ్ హీరోలు, స్మాల్ ఫిలింస్‌‌తో 70 శాతం విజయాలు అందుకున్నాం.

కొత్త వాళ్లకోసం స్టార్ట్ చేసిన ఈ బ్యానర్‌‌‌‌లో ప్రస్తుతం నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. వాటిలో ‘మార్కండేయ’ ఒకటి. కంటెంట్ నచ్చి ఈ చిత్రాన్ని మా బ్యానర్‌‌‌‌లో మొదటి చిత్రంగా టేకప్ చేశాం.  సీజీ వర్క్ ఎక్కువగా ఉన్న చిత్రమిది.  వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదల చేస్తాం’ అని చెప్పారు.  హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘ఇతిహాసాల నుంచి తీసుకున్న  ఒక కథకు ఆధునిక రూపమే మా మూవీ. ఇదొక  మిస్టిక్ థ్రిల్లర్.  దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్‌‌‌‌లో ఫస్ట్ మూవీ కాబట్టి గుర్తుండిపోయేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని అన్నాడు. తమ లాంటి కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్న   దిల్ రాజు గారికి ఆయన టీమ్‌‌కు డైరెక్టర్ సిస్ట్లా థ్యాంక్స్ చెప్పాడు.