జగిత్యాల జిల్లాలో విషాదం.. కొండగట్టులో దర్శనం.. గంటలోనే కారు యాక్సిడెంట్.. భార్యాభర్త స్పాట్ డెడ్

జగిత్యాల జిల్లాలో విషాదం.. కొండగట్టులో దర్శనం.. గంటలోనే కారు యాక్సిడెంట్.. భార్యాభర్త స్పాట్ డెడ్

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో విషాద ఘటన జరిగింది. కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకుని తిరిగి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు–లారీ ఢీకొని ఇద్దరు దంపతులు స్పాట్ లోనే చనిపోయారు. కూతురి పరిస్థితి విషమంగా ఉంది.

మెట్ పల్లి మండలం చౌలమద్ది గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చనిపోయిన భార్య, భర్తను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథనికి చెందిన కోటగిరి మోహన్, లావణ్యగా పోలీసులు గుర్తించారు. వీళ్ల కూతురు కీర్తన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

సంగారెడ్డి కంది దగ్గర NH 65పై కూడా శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు మెదక్‌ నుంచి పటాన్‌చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.

►ALSO READ | టిప్పర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం.. బస్సులో 60 మంది