‘గ్రీన్ ట్యాక్స్’ కష్టాలు.. టెక్నికల్ ఇష్యూస్తో ఇబ్బందులు 

‘గ్రీన్ ట్యాక్స్’ కష్టాలు.. టెక్నికల్ ఇష్యూస్తో ఇబ్బందులు 
  • ఆర్టీఏ వెబ్​సైట్​లో క్ కాని స్లాట్​ 
  • మీ సేవ కేంద్రాల్లోనూ కనిపించని  గ్రీన్ ట్యాక్స్ ​ఆప్షన్స్  
  • లేటయితే జరిమానాలతో బాదుడు

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్​లో గడువు తీరిన వాహనాలను గ్రీన్​ట్యాక్స్​తో రెన్యూవల్​ చేయించుకోవడానికి వాహనదారులు తిప్పలు పడాల్సి వస్తున్నది.15 ఏండ్లు పూర్తి చేసుకున్న వాహనం ఏదైనా (ఈవీ, సీఎన్జీ మినహా) గ్రీన్​టాక్స్​ చెల్లిస్తే ఐదేండ్ల పాటు బండి నడుపుకోవడానికి అనుమతినిస్తారు.

కానీ, సిటీ ఆర్టీఏ కేంద్రాలతో పాటు మీసేవ కేంద్రాల్లో సర్వర్​ డౌన్​ కావడం, గ్రీన్​ట్యాక్స్​ ఆప్షన్ కనిపించకపోవడం, ఇతర కారణాలతో రెన్యూవల్​ చేయించుకోవాలంటే కావడం లేదు. దీంతో గడువు దాటిందంటూ ప్రతి వాహనంపై నెలకు రూ.500 చొప్పున ఫైన్​ వేస్తున్నారు. గడువు ముగిసి నెల పూర్తి కాకపోయినా, రోజులు గడిచినా ముక్కుపిండి మరీ జరిమానా వసూలు చేస్తున్నారు. 

గడువు దాటినవి 27వేలు 

ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో కాలం చెల్లిన వాహనాల్లో దాదాపు17 వేల వరకు టూ వీలర్లు, మరో 10వేల వరకు కార్లు, ఇతర వాహనాలున్నాయి. టూ వీలర్లకు రూ.2వేలు, కార్లకు రూ.5వేలు, ఇతర భారీ వాహనాలకు రూ.10వేలు గ్రీన్​ ట్యాక్స్​గా చెల్లిస్తే ఆర్టీఏ ఫిట్​నెస్​సర్టిఫికెట్​ఇచ్చి అనుమతినిస్తుంది. అయితే, గడువు దాటి ఒకటి, రెండు నెలలు దాటినవారు తమ వాహనాలను రెన్యూవల్ ​చేయించుకోవడానికి ఆసక్తితో ఉన్నా టెక్నికల్​సమస్యలు వెంటాడుతున్నాయి.

ఆర్టీఏ వెబ్​సైట్​లో స్లాట్ ​బుక్ ​కావడం లేదు. అదృష్టవశాత్తు స్లాట్​బుక్​ అయినా డబ్బులు కడదామంటే ఓటీపీ రావడం లేదు. కొందరికి పేమెంట్​గేట్​వేలు నిలిచిపోయి రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. మీ సేవా కేంద్రాల్లోనూ గ్రీన్ ట్యాక్స్​ఆప్షన్స్ రావడం లేదు. పలు సెంటర్లలో సర్వర్​డౌన్​ కావడమో లేక డేటా నాట్ ​ఫౌండ్ ​అనో వస్తోంది. ఈ విషయమై ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తే సాంకేతి సమస్యలను సరిచేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ సేవా కేంద్రాల్లో మాత్రం సర్వర్​ డౌన్​ కావడం, సాంకేతిక సమస్యలకు తమకు సంబంధం లేదని చెప్తున్నారు.

గడువులోపు చెల్లిస్తేనే ఇన్సూరెన్స్​

వాహనాల గడువు ముగింపులోపు గ్రీన్​ట్యాక్స్ ​చెల్లిస్తేనే ఇన్సూరెన్స్​ వంటివి వర్తిస్తాయని, గడువు తీరాక కడితే ఇన్సూరెన్స్​వర్తించదని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. దీనివల్ల కూడా చాలామంది గ్రీన్​ట్యాక్స్​కట్టడానికి ఆసక్తి చూపడం లేదు. జరిమానాతో గ్రీన్​ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు ఇన్స్యూరెన్స్ ​కూడా వర్తించేలా చేయాలని వాదిస్తున్నారు. బీమా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే అటు ప్రమాదానికి గురైన వారితో పాటు నడిపిన వారికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. 

జరిమానా ఎక్కువని కడ్తలేరు​

రెన్యూవల్​ చేయించుకోని వారికి రూ.నెలకు 500  చొప్పున ఫైన్లు వేస్తుండడంతో చాలామంది తమ వాహనాలకు గ్రీన్​ట్యాక్స్​కట్టడం లేదు. ఉదాహరణకు ఒక టూ వీలర్​గడువు ముగిసి రెండేండ్లు అయ్యిందనుకుంటే అతడు నెలకు రూ. 500 చొప్పున రెండేండ్లకు రూ.12 వేలు జరిమానా కట్టాల్సి వస్తున్నది. అలాగే వీటితో పాటు గ్రీన్​ ట్యాక్స్​ రూ.2వేలు కలిపి రూ.14వేలు చెల్లించాలి. ఇంకా మూడేండ్లు, నాలుగేండ్లు దాటినవి అయితే ఇంకా భారీగానే ముట్టజెప్పాలి.

ఇలాంటి వాహనాలు నగరంలో వేల సంఖ్యలోనే ఉన్నాయి. అంతంత జరిమానాలు కట్టే బదులు దొరికినప్పుడు చూసుకుందాం లే అని లైట్​ తీస్కుంటున్నారు. ఇలాంటి వాహనాల విషయంలో అధికారులు వెసులుబాటు కల్పించి జరిమానా మాఫీ చేయడమో, లేదా తగ్గించడమో చేస్తే బాగుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు.