వార్ ఎఫెక్ట్: పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు.. వాహనదారులు గగ్గోలు..

వార్ ఎఫెక్ట్: పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు.. వాహనదారులు గగ్గోలు..

అమెరికా, ఇరాన్ వార్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ కొరతతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్, పెట్రోల్ కొరత ఎఫెక్ట్ మన దేశంలో తీవ్ర రూపం దాల్చుతోంది. గ్యాస్ కొరతతో చాలావరకు హోటళ్లు మూతపడగా.. పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్ లాంటి సిటీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా పెట్రోల్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

ఇబ్రహీంపట్నంలోని పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో  వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు.  పట్టణంలోని పెట్రోల్ పంపుల్లో సోమవారం ( మార్చి 16 ) స్టాక్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 

ఇబ్రహీంపట్నంలో మొత్తం 10 పెట్రోల్ పంపుల్లో మొత్తం నా స్టాక్ బోర్డులు పెట్టి బంద్ చేశారు.వాహనదారులు వివిధ పనులపై వెళ్లేవారు పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబున్నప్పటికి పెట్రోల్ పంపుల్లోస్టాక్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు వాహనదారులు.