ఎంఐఎం సభ్యులపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ ఎమ్యెల్యే ధన్పాల్సూర్యనారాయణ

ఎంఐఎం సభ్యులపై చర్యలు తీసుకోవాలి :  బీజేపీ ఎమ్యెల్యే ధన్పాల్సూర్యనారాయణ
  •     బీజేపీ ఎమ్యెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో వందేమాతరం గీతం ఆలపించకుండా బయటకు వెళ్లిన ఎంఐఎం సభ్యులపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్యెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ డిమాండ్​ చేశారు. గవర్నర్​ ప్రసంగంలో ఆరు గ్యారంటీల మాటే లేదన్నారు. అన్నీ అబద్ధాలు, తప్పుడు వివరాలే గవర్నర్​తో  చెప్పించారని విమర్శించారు. ‘‘రైతు రుణ మాఫీ 50 శాతమే చేశారు. 

వరిపై బోనస్​ కూడా ఒక్కపంటకే ఇస్తున్నారు. అలాగే, ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పలేదు. ఆరోగ్యశ్రీకి నిధులు రావడం లేదు. రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యవహరించిన ఎంఐఎం సభ్యుల చర్యలు దేశాన్నే అవమానించినట్టు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తం. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఊరుకోం. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తం” అని అన్నారు.