జ్యోతిష్యం: సంక్రాంతి పండుగ.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.. ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం ఇవ్వాలి..!

జ్యోతిష్యం:  సంక్రాంతి పండుగ.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.. ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం ఇవ్వాలి..!

హిందూ పంచాంగం ప్రకారం..  2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమవుతుంది.   ఆరోజున  సూర్యుడు దక్షిణయానం ముగించుకుని ఉత్తరయానాన్ని ప్రారంభిస్తాడు. అప్పటినుంచి శుభ సమయం ప్రారంభమవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఆ రోజున  జన్మ రాశిని బట్టి కొన్ని వస్తువులను కచ్చితంగా దానం చేయాలి. సంక్రాంతి రోజున  నువ్వులతో  ఏ రాశి వారు  పాటు ఎలాంటివి దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  ! 

మకర సంక్రాంతి పండుగ వేళ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి నువ్వులతో తలస్నానం చేసి, పూజలు చేయడం, నువ్వుల ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. 

ALSO READ : మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి

  •  మేష రాశి : ఈ రాశి వారు  సంక్రాంతి రోజున పప్పులు, బెల్లం, నువ్వులు దానంగా ఇవ్వాలి. 
  • వృషభ రాశి: ఈ రాశి వారు  వస్త్రాలు.. నువ్వలు  దానం చేయాలి.
  •  మిథున రాశి   : ఈ రాశి వారు  నువ్వుల లడ్డూను దానం చేస్తే  మంచి ఫలితాలు చేకూరుతాయి. 
  • కర్కాటక రాశి : ఈ రాశి వారు సంక్రాంతి పండుగ రోజు నల్ల నువ్వులు.. బెల్లం..మినుముల దానం చేయాలి. 
  •  సింహరాశి:  బెల్లం లడ్డూ, నువ్వుల లడ్డూలను రాగి పాత్రలో దానంగా ఇవ్వాలి. 
  • కన్యారాశి: బెల్లం... నువ్వుల  కిచిడీ దానం చేయాలి. 
  • తులారాశి:  నువ్వులతో పాటు  పాలు, పెరుగు, నెయ్యి, వెన్నె , నువ్వుల లడ్డూ దానం చేస్తే మంచిది.
  • వృశ్చిక రాశి :  బెల్లం.. నువ్వులు.. పప్పు కిచిడీని దానం చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ధనస్సు రాశి: పసుపు చందనం, బెల్లం లడ్డూలు,  నువ్వులను దానం చేయాలి.  
  • మకరరాశి : ఈ రాశి అధిపతి  శని .  నల్ల నువ్వుల లడ్డూ, ఆవనూనెను దానం చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం కలుగుతుంది.
  •  కుంభరాశి: ఈ రాశికి కూడా అధిపతి శని భగవానుడు.  ఈ రాశిలో జన్మించిన వాళ్లు నువ్వుల లడ్డూలను దానంగా ఇవ్వాలి. 
  • మీన రాశి : ఎర్రటి పండ్లు.. వస్త్రాలు,,  బొప్పాయి, శనగపప్పు.. బెల్లం.. నువ్వులతో చేసిన లడ్డూను  దానం చేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.