Sreeleela: "డాక్టర్ శ్రీలీల".. మెడిసిన్ పూర్తి చేసిన డాన్సింగ్ క్వీన్!

Sreeleela: "డాక్టర్ శ్రీలీల"..  మెడిసిన్ పూర్తి చేసిన డాన్సింగ్ క్వీన్!

టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల మరో సారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఈ బ్యూటీ వార్తల్లో నిలిచింది యాక్టర్ గా కాదు.. అంతకంటే గొప్ప విజయాన్ని సొంతం చేసుకుని. ఒకవైపు సిల్వర్ స్కీన్ పై మెరుపులు మెరిపిస్తూనే.. మరో వైపు వైద్య విద్యను పూర్తి చేసి 'డాక్టర్ శ్రీలీల' గా పట్టా అందుకున్నారు. సినీ గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే కష్టతమైన మెడిసిన్ పూర్తి చేయడం హాట్ టాపిక్ గా మారింది.  డాక్టర్ పట్టా అందుకున్న ఈ ముద్దుగుమ్మకు నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  డాక్టర్ పట్టా అందుకున్న శ్రీలీల..

శ్రీలీల తన మెడికల్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తన కాన్వొకేషన్ వేడుకలో ఎర్రటి గ్రాడ్యుయేషన్ గౌను, క్యాప్ ధరించి చిరునవ్వుతో డిగ్రీని అందుకుంటున్న ఫోటోలు, వీడియోలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న కథానాయికలు చదువును మధ్యలోనే వదిలేస్తుంటారు. కానీ శ్రీలీల మాత్రం వరుస షూటింగ్‌లు, డ్యాన్స్ ప్రాక్టీస్ మధ్యలో కూడా పుస్తకాలతో కుస్తీ పట్టి, పట్టుదలతో డాక్టర్ అయ్యారు. చదువుకు మించిన ఆస్తి లేదు అని శ్రీలీల ఈ విజయంతో నిరూపించారని ప్రశంసిస్తున్నారు..

 క్రేజీ ప్రాజెక్ట్ లలో.. 

అటు శ్రీలీల తన సినీ కెరీర్ లోనూ స్పీడ్ పెంచారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న 'D55' చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికయ్యారు. 'అమరన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజ్‌కుమార్ పెరియాసామి ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాల్లో ధనుష్, సాయి పల్లవిలతో కలిసి శ్రీలీల సందడి చేశారు. ఇటీవల సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన 'పరాశక్తి' అనే పొలిటికల్ యాక్షన్ డ్రామాలో తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తూ, అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక భారీ చిత్రంలో శ్రీలీల నటిస్తోంది.