Vastu tips: మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి.. దక్షిణం దిక్కులో పూజామందిరం ఉంటే నష్టాలొస్తాయా..!

Vastu tips:  మెయిన్ డోర్ ఎక్కడ ఉండాలి.. దక్షిణం దిక్కులో పూజామందిరం ఉంటే నష్టాలొస్తాయా..!

చాలా మందికి సొంతిల్లు ఒక కల.  అయితే ఉన్నంతలో ఇల్లు కట్టుకోవాలని అందరూ అనుకుంటారు.   ఇంటి గేట్ల  నిర్మాణంలో  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.   రెండు మెయిన్​ డోర్​ లు  ఉంటే ఇబ్బందులు వస్తాయి.. దక్షిణం దిక్కులో పూజా మందిరం ఇబ్బందులు వస్తాయా.. .. మొదలగు విషయాల గురించి  వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్  గారి సలహాలను ఒకసారి చూద్దాం

ప్రశ్న: ఉత్తర ముఖద్వారంతో ఇల్లు కట్టుకుంటున్నాం. దానికి మెయిన్ గేట్ ఉత్తర ఈశాన్యం, ఉత్తర ఆగ్నేయంలలో ఏవైపు ఉండాలి?

జవాబు:  ఉత్తర ముఖద్వారంతో ఇల్లు ఉన్నప్పుడు..మెయిన్ గేట్ ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. మెయిన్ గేట్స్ ఒకటి లేదా రెండు మాత్రమే పెట్టుకుంటే మంచిది. ఎక్కువ గేట్స్ అయితే, సరిసంఖ్యలో ఉండాలి.

ప్రశ్న: ఆగ్నేయం మూలలో కిచెన్ ఉంది. కిచెన్​ ను ఆనుకుని దక్షిణం వైపు దేవుడి పూజ గది కట్టుకోవచ్చా? దేవుడు తూర్పు వైపు చూసేలా ఉంచొచ్చా?

జవాబు: దక్షిణం వైపు పూజగది కట్టుకోకూడదు. ఆగ్నేయంలో కిచెన్ ఉన్నప్పుడు, ఈశాన్యంలో పూజగది ఉండాలి. దేవుడు పడమర వైపు చూస్తూ ఉండాలి. మీరు తూర్పు వైపు చూస్తూ పూజ చేసుకుంటే మంచిది.