థాయిలాండ్ లో కాల్పుల కలకలం రేగింది.. సొంక్లాలోని ఓ డే కేర్ సెంటర్లో కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బుధవారం ( ఫిబ్రవరి 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. టాంబోన్ పటోంగ్‌లోని పటోంగ్ ప్రథాన్ ఖిరివాట్ డే కేర్ సెంటర్లోకి గన్స్ తో చొరబడిన దుండగులు అక్కడున్న సిబ్బందిపై దాడి చేసి కాల్పులు జరిపినట్లు సమాచారం.
కాల్పుల్లో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం స్కూల్ పోలీసుల భద్రతలో ఉందని తెలిపింది స్కూల్ యాజమాన్యం. స్కూల్ క్లోజింగ్ టైంలో దుండగులు చొరబడ్డారని.. కొంతమంది టీచర్స్ ని స్టూడెంట్స్ ని బంధించారని తెలిపారు. ఈ క్రమంలో హాట్ హాయ్ పోలీసులు, స్పెషల్ టీమ్స్ స్కూల్ ని చుట్టుముట్టి.. దుండగుల ఆదీనంలో ఉన్నవారిని బయటికి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
భద్రతా కారణాల దృష్ట్యా.. స్కూల్ కి సమీపంలో ఉన్న అన్ని దారులు ముసేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మొద్దని.. ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన అప్ డేట్స్ ని మాత్రమే విశ్వసించాలని కోరుతున్నారు పోలీసులు.
