సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్న క్రమంలో దట్టమైన పొగ కమ్మేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇంద్రేశం మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో గోదాంలో సిబ్బంది ఎవరు లేరని తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
