టెక్నో నుంచి అదిరిపోయే స్లిమ్ ఫోన్: స్టైలిష్ డిజైన్, ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

టెక్నో నుంచి అదిరిపోయే స్లిమ్ ఫోన్: స్టైలిష్ డిజైన్, ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో నుండి కొత్త స్మార్ట్ ఫోన్ టెక్నో పోవా కర్వ్ 2 5G డిజైన్, స్పెసిఫికేషన్లు, కెమెరా సెటప్, బ్యాటరీ, ధర అఫీషియల్ లాంచ్ కు ముందే లీక్  అయ్యాయి. టెక్నో పోవా కర్వ్ 2 5G అనేది టెక్నో పోవా కర్వ్  అప్ డేట్ వెర్షన్,  ఈ మోడల్ డిజైన్ ఇంకా మీ డబ్బుకు వాల్యూ ఇస్తుంది. కొత్త టెక్నో ఫోన్ ఫ్యూచర్  డిజైన్,  కర్వ్ డిస్ ప్లేతో ఉంటుందిని తెలుస్తుంది. అయితే టెక్నో పోవా కర్వ్ 2 5G ఇండియా లాంచ్ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. 7.4mm స్లిమ్ ఉన్న ఈ ఫోన్ మూడు కలర్ అప్షన్స్ లో రాబోతుంది.  

టెక్నో పోవా కర్వ్ 2 5G స్పెసిఫికేషన్లు
టెక్నో పోవా కర్వ్ 2 5G పాత మోడల్‌ డిజైన్‌ లాగానే ఉంటుంది. కెమెరా యూనిట్ మాత్రం ఇప్పుడు కొత్తగా ఇచ్చారు, పోవా కర్వ్ 2 5G 7.4mm సన్నగా, 194g బరువు ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి చాల కంఫర్ట్ ఉంటుంది.  

ఈ ఫోన్ పాత మోడల్ లాగానే సన్నని అంచులతో కార్ప్ డిస్ ప్లే  స్క్రీన్‌, మంచి రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వ్  AMOLED స్క్రీన్ ఉంటుందని తెలుస్తుంది. దీనిలో MediaTek Dimensity 7100 చిప్‌, 12GB వరకు ర్యామ్,    256GB స్టోరేజ్ అప్షన్ చూడొచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ Android ఆధారిత HiOS అని భావిస్తున్నారు.

టెక్నో పోవా కర్వ్ 2 5Gకి  మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని అంచనా. దీనికి 8,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని పుకార్లు ఉన్నాయి.

 టెక్నో పోవా కర్వ్ 2 5G ధర 
పోవా కర్వ్ 2 5G ధర ఎంత ఉంటుందో టెక్నో ఇంకా ప్రకటించలేదు. అయితే ఇండియాలో  దీని ధర రూ. 15,000 నుండి రూ. 20,000 మధ్య ఉంటుందని అంచనా. కానీ లీక్‌లు నిజమైతే  టెక్నో పోవా కర్వ్ 2 5G ధర పాత  మోడల్ కంటే చాలా ఎక్కువే. మీరు టెక్నో పోవా కర్వ్ 2 5Gని ఫ్లిప్‌కార్ట్‌ ఇంకా ఆన్ లైన్ స్టోర్లలో కొనొచ్చు.