జ్యోతిష్యం : కుంభ రాశి.. శతభిషా నక్షత్రంలో  రాహువు, శుక్రుడు.. 11 రోజులు.. ఈ 4 రాశుల వాళ్లకు ఊహించని పరిణామాలు.. !

జ్యోతిష్యం : కుంభ రాశి.. శతభిషా నక్షత్రంలో  రాహువు, శుక్రుడు.. 11 రోజులు.. ఈ 4 రాశుల వాళ్లకు ఊహించని పరిణామాలు.. !

జ్యోతిష్య శాస్త్రం.. నవగ్రహాలు.. రాశులు.. నక్షత్రాలు.. ఆధారంగా పండితులు అంచనా వేస్తారు.  ఏ రాశిలో ఏ గ్రహం సంచరిస్తుంది.. ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉంది.. ఇలా అనేక విషయాలు గణించి జాతక ఫలితాలు చెబుతారు.  నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం .. ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు రాశి సంచారాలు చేయబోతున్నాయి.  ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు శుక్రుడు... రాహువు.. కుంభ రాశి..  శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.  ఇక్కడే  ఫిబ్రవరి 22 వరకు  అక్కడే ఉంటారు. శుక్రుడు నక్షత్ర మార్పు వలన కొన్ని రాశుల వారికి ఆకస్మికంగా ధనలాభం  (వృషభం, మిథునం, కుంభం, తుల ) కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . ! 

వృషభరాశి : ఈ రాశి వారికి శుక్రుడు  అధిపతిగా వ్యవహరిస్తాడు. శతభిషా నక్షత్రంలో శుక్రుడు సంచరించే పమయంలో వీరికి  శువృషభ రాశి వారికి శుక్రుడు ఎల్లప్పుడూ అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి వీరికి ఈ సమయం చాలా శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.  విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. సాధారణ జీవితంలో  ఒత్తిడి  తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

మిథున రాశి : ఈ రాశి  వారికి ఈ సమయంలో అదృష్టం అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది.గతంలో నిలిచిపోయిన మొండి బకాయిలను  తిరిగి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా మారడమే కాకుండా కొత్త ఆలోచనలతో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.  ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి.   ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

కుంభరాశి   :  ఈ రాశి వారికి ఊహించని మార్పులు కలుగుతాయి.  వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు అద్భుతమైన పెట్టుబడులు వస్తాయి.  గతంలో పోగొట్టుకున్న డబ్బును ఈ సమయంలో తిరిగి పొందుతారు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గతంలో పడిన ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది. 

తులారాశి  : ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.  అన్ని విధాలుగా చాలా మంచి జరుగుతుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వస్తుంది.  ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.   వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు  కార్యాలయంలో  కీలకపాత్ర పోషించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.