Telangana Municipal Elections: జనగామలో డబ్బుల కోసం రోడ్డెక్కిన మహిళా ఓటర్లు.. పోలింగ్ కేంద్రం దగ్గర..

Telangana Municipal Elections: జనగామలో డబ్బుల కోసం రోడ్డెక్కిన మహిళా ఓటర్లు.. పోలింగ్ కేంద్రం దగ్గర..

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జారుతున్న ఈ ఎన్నికల్లో చదురుముదురు ఘటనలు మినహా ఎక్కడా అల్లర్లు చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా.. జనగామ జిల్లాలో డబ్బుల కోసం ఓటర్లు రోడ్డెక్కారు. జనగామ మున్సిపాలిటీలోని 23వ వార్డులో కొంతమందికి ఓటుకు డబ్బులు ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ఆందోళనకు దిగారు ఓటర్లు.

జనగామ మున్సిపాలిటీలోని 23వ వార్డులో ఉన్న సరస్వతి స్కూల్ పోలింగ్ కేంద్రం దగ్గర మహిళా ఓటర్లు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొంతమందికి మాత్రమే ఓటుకు డబ్బులు ఇచ్చారని.. తమకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా ఓటర్లు. బీఆర్ఎస్ అభ్యర్థిని పది సంవత్సరాలు ఓటు వేసి గెలిపించుకున్నామని...ఈ ఎన్నికల్లో డబ్బులు మాత్రం కొందరికే  పంపిణీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా ఓటర్లు.

ALSO READ : భారత్ బంద్కు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్

ఓటుకు డబ్బులు ఇవ్వలేదంటూ.. అది కూడా పోలింగ్ రోజున, పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లు ఆందోళనకు దిగడం విడ్డూరమనే చెప్పాలి. గతంలో ఓటుకు డబ్బు ఇవ్వాలంటూ అభ్యర్థుల ఇళ్లకు ఓటర్లు వెళ్లిన ఘటనలు చూశాం కానీ.. ఇలా పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లు ఆందోళనకు దిగడం ఇదే తొలిసారి కావచ్చు.