Messi Slap Goes Viral : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో ప్రత్యర్థి జట్టు ప్లేయర్‌పై చెయ్యి చేసుకోవడంతో మేజర్ లీగ్ సాకర్ (MLS) ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా జరిమానా విధించింది. ఇంటర్ మైయామి, ఫిలడెల్ఫియా యూనియన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతుంది.
ప్రత్యర్థి ప్లేయర్ ని కొట్టిన మెస్సీ.. అసలేం జరిగింది?:
ఫిలడెల్ఫియా యూనియన్‌తో 2–2తో సమంగా ముగిసిన మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో ఈ హై-డ్రామా చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియా మిడ్‌ఫీల్డర్ క్విన్ సుల్లివాన్‌తో మెస్సీకి మైదానం మధ్యలో కొట్లాట జరిగింది. ఆవేశంలో మెస్సీ సుల్లివాన్ మెడ వెనుక భాగంలో కొట్టడం వీడియోలో క్లియర్ గా కనిపించింది. మైదానంలో ఎదుటి ఆటగాళ్ల తల లేదా మెడ భాగంపై దాడి చేయడం రూల్స్ కు విరుద్ధంగా పరిగణించిన ఎంఎల్ఎస్ (MLS), మెస్సీతో పాటు అతని సహచరుడు ఇయాన్ ఫ్రేకి జరిమానా విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తండ్రి మరణం తర్వాత మ్యాచ్.. సస్పెన్షన్ లేకపోవడంతో ఫ్యాన్స్ రిలీఫ్:
తన తండ్రి జార్జ్ మెస్సీ మరణించిన తర్వాత లియోనల్ మెస్సీ ఆడిన రెండో మ్యాచ్ ఇది కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఒక గోల్ కొట్టడంతో పాటు మరొక గోల్‌కి అసిస్ట్ ఇచ్చి మెస్సీ ఇంటర్ మైయామిని ఓటమి నుంచి కాపాడాడు. అయితే క్రమశిక్షణా రాహిత్యం కింద భారీ మొత్తంలో జరిమానా విధించినప్పటికీ, మెస్సీపై ఎలాంటి మ్యాచ్ సస్పెన్షన్ (బ్యాన్) విధించకపోవడంతో ఇంటర్ మైయామి ఫ్యాన్స్ తీవ్ర ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ : పాకిస్థాన్‌కు పట్టపగలే చుక్కలు
మైదానంలో రెడ్ కార్డ్‌ల రచ్చ.. క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్:
ఈ మ్యాచ్ ముగింపు సమయం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇరు జట్ల ప్లేయర్లు కొట్టుకునే స్థాయికి వెళ్లడంతో అంపైర్లు మైయామి ప్లేయర్ యాన్నిక్ బ్రైట్, ఫిలడెల్ఫియా ప్లేయర్ కవాన్ సుల్లివాన్‌లకు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపేశారు. కాగా, మెస్సీ చేతిలో దెబ్బతిన్న క్విన్ సుల్లివాన్ తమ్ముడే ఈ కవాన్ సుల్లివాన్ కావడం గమనార్హం. అయితే ఫిలడెల్ఫియా టీమ్ అప్పీల్ చేయడంతో లీగ్ కమిటీ రివ్యూ నిర్వహించి కవాన్ సుల్లివాన్‌కి ఇచ్చిన రెడ్ కార్డ్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
🚨🚨| JUST IN: Lionel Messi tapped Quinn Sullivan on the back of the neck before confronting him head-on.
— CentreGoals. (@centregoals) August 20, 2026
This action will now be evaluated by the Disciplinary Committee.
[@Jarm21] pic.twitter.com/nKRRYjif2b
