మెగా ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. ఇంతకీ ఏ సినిమా కోసం?

మెగా ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. ఇంతకీ ఏ సినిమా కోసం?

సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) మెగా ఛాన్స్ కొట్టేసిందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల భోళా శంకర్(Bhola shankar)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్(Megastar).. ఆ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత చిరు రెండు సినిమాను అనౌన్స్ చేశాడు. ఆగస్టు 22న ఆయన పుట్టిన రోజు సంధర్బంగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. 

అందులో ఒకటి తన కూతురు సుష్మిత నిర్మాణ సంస్థలో చేస్తుండగా.. రెండోవది యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిరు చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను బింబిసారా దర్శకుడు వశిష్ట తెరకెక్కించనున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ కు కూడా ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. 

Also Read :- Miss shetty Mr Polishetty Twitter Review: కామెడీతో కితకితలు పెట్టిన నవీన్, అనుష్క

అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో చిరుకు జోడీగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ను తీసుకోనున్నారట మేకర్స్. పీరియాడికల్ అండ్ సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాలో యువరాణి పాత్ర కోసం మృణాల్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారట మేకర్స్. ఈమేరకు ఆమెతో చర్చలు కూడా జరిగాయని. మెగాస్టార్ తో సినిమా అనగానే మృణాల్ కూడా వెంటనే ఒకే చెప్పేసిందని టాక్. ఈ వార్త గనుక నిజమైతే మృణాల్ మెగా ఛాన్స్ కొట్టేసినట్టే. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.