ఎంఎస్ ధోనీ.. ఇండియన్ క్రికెట్ లో సుదీర్ఘ కాలం ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్యారీ చేస్తున్న వెటరన్ క్రికెటర్. ఇండియన్ టీమ్ కు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇంకా ఆ క్రేజీ తగ్గలేదు. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని ఆటను చూసేందుకు ఫ్యాన్స్ సీజన్ నుంచి మరో సీజన్ వరకు ఎదురు చూస్తుంటారు. వయసు పెరుగుతున్న కారణంగా ఈ మాజీ కెప్టెన్ రిటైర్ అవుతారని ప్రతీఏటా ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. రిటైర్మెంట్ ఎప్పుడు అని అడిగిన ప్రతీసారి.. చూద్దాం.. అంటూ దాటవేస్తూ వస్తున్నారు ధోనీ.
అయితే రిటైర్మెంట్ పై ధోనీ, తమిళ హీరో శివకార్తికేయన్ కు మధ్య జరిగిన చాట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో CSK ఫ్యాన్ ఈవెంట్ సందర్భంగా శివకార్తికేయన్ అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కు ధోనీ ఇచ్చిన సమాధానంతో స్టేడియం అంతా హోరిత్తిపోయింది. మార్చి 22న జరిగిన ఈ వెంట్ లో.. రిటైర్మెంట్ ఆలోచన మరిచిపోయి.. చెన్నైకి నాయకత్వం వహిస్తూనే ఉండాలన్న మాటకు ధోనీ చేసిన కామెడీ ఇప్పుడు వైరల్ గా మారింది.
ధోనీ-శివకార్తికేయన్ సంభాషణ:
శివకార్తికేయన్ :“మీరు రిటైర్ అవుతున్నారా? అంటే'ఖచ్చితంగా కాదు' అని చెప్పారు. ప్రతీ ఏటా అదే సమాధానం మీ నుంచి వస్తుంది. అందుకే మీకు 60 ఏళ్లు వచ్చే వరకు మీరు చెన్నైకి ఆడుతూనే ఉండాలి.”
ధోనీ: నవ్వుతూ, "ఇది చాలా కష్టం" అని బదులిచ్చాడు.
శివకార్తికేయన్ : "మీ ఫిట్‌నెస్‌తో ఇది సులభం అని నేను అనుకుంటున్నాను".
ధోనీ:“ఇది చాలా కష్టం. ఫిట్ నెస్ పెరిగే మార్గంలో లేదు.. తగ్గే మార్గంలో ఉంది..కానీ నేను ప్రయత్నిస్తాను,” అని ధోనీ అన్నాడు.
►ALSO READ | ముస్తాఫిజుర్ వివాదం: మా తప్పు తెలుసుకున్నాం.. భారత్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ ముఖ్యం అంటున్న బంగ్లా
ధోనీ “ప్రయత్నిస్తాను” అనగానే ప్రేక్షకులు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ, చప్పట్లతో స్టేడియం అంతా హోరెత్తించారు. మీరు ఆడుతూనే ఉండాలి మచా.. అన్నట్లుగా అప్లాస్ ఇచ్చారు. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన శివకార్తికేయన్ "మాకు సమాధానం దొరికింది" అని నవ్వుతూ ధోనీకి రిప్లై ఇచ్చాడు. ఈ ఫన్నీ చాట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ గా మారింది.
Wait for it.. #WhistlePodu #Roar26 pic.twitter.com/CjBX6sCEis
— Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2026
