ముస్తాఫిజుర్ వివాదం: మా తప్పు తెలుసుకున్నాం.. భారత్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ ముఖ్యం అంటున్న బంగ్లా

ముస్తాఫిజుర్ వివాదం: మా తప్పు తెలుసుకున్నాం.. భారత్తో ఫ్రెండ్లీ రిలేషన్స్  ముఖ్యం అంటున్న బంగ్లా

ఐపీఎల్ లో మా వాళ్లు ఆడరు.. ఐపీఎల్ ను మేము బహిష్కరిస్తున్నాం.. అంటూ బీరాలు పలికిన బంగ్లాదేశ్ పీచమణిగినట్లుంది. ముస్తాఫిజుర్ రెహమాన్ వివాదంతో భారత్ పై తీవ్ర నిందలు వేసి.. ఎట్టకేలకు గత్యంతరం లేక దిగొచ్చింది. మేము భారత్ తో ఫ్రెండ్లీ రిలేషన్స్ కోరుకుంటున్నాం అంటూ ప్రకటించింది. 

లేటెస్టుగా బంగ్లా స్పోర్ట్స్ మినిస్టర్ ఇండియాతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఇండియాతో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. 

ముస్తాఫిజుర్ వివాదం:

బంగ్లాలో హిదువులపై దాడుల తర్వాత.. ఆ దేశానికి చెందిన ప్లేయర్లను ఐపీఎల్ నుంచి తొలగించాల్సిందిగా తీవ్ర ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో KKR టీమ్ నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను రిలీజ్ చేసింది. వాస్తవానికి 2026 ఐపీఎల్ కోసం ముస్తాఫిజుర్ ను 9 కోట్ల రూపాయలకు కేకేఆర్ దక్కించుకుంది. కానీ దేశ ప్రజల నుంచి విమర్శలు, ఒత్తిడి కారణంగా రిలీజ్ చేయాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. దీంతో కేకేఆర్ అతన్ని వదులుకుంది. 

ఐసీసీ షాక్:

దీంతో బీసీసీఐ పై బంగ్లాదేశ్ తీవ్ర విమర్శలు చేసింది. ఇండియాలో ఐపీఎల్ లో మా ప్లేయర్లు ఆడరని ప్రకటించింది. అదే విధంగా టీ20 వరల్డ్ కప్ ను ఇండియా నుంచి శ్రీలంకకు తరలించాల్సిందిగా ఐసీసీని డిమాండ్ చేసింది. బంగ్లా ఒత్తిడికి తలొగ్గకుండా షెడ్యూల్ లో ఎలాంటి మార్పు చేయలేదు. అదే విధంగా టీర్నీ నుంచి బంగ్లా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. బంగ్లా ప్లేస్ లో స్కాట్లాండ్ ఆడింది. 

వరుస పరిణామాలు బంగ్లాదేశ్ కు చెంపపెట్టుగా మారాయి. టీ20 టోర్నీ నుంచి నిష్క్రమణ, ఐసీసీ షాకివ్వడం తర్వాత.. క్రికెట్ విషయంలో మొదటికే మోసం వచ్చేలా ఉందని బంగ్లాకు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. క్రికెట్ నుంచి వచ్చే ఆదాయం కూడా కోల్పోతే దేశం మరింత సంక్షోభంలోకి వెళ్తుందన్న భయాందోళనలతో కాబోలు.. ఇండియాతో స్నేహం కోరుకుంటున్నామని ఆ దేశ క్రీడా శాఖ మంత్రి ప్రకటించారు.