ఆలయాల్లో విఐపీ దర్శనాలు, సెల్ ఫోన్ వాడకంపై..తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆలయాల్లో విఐపీ దర్శనాలు, సెల్ ఫోన్ వాడకంపై..తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

తమిళనాడులోని  ఆలయాల్లో వీఐపీ దర్శనాలు,  సెల్ ఫోన్ల వాడకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయాల్లో వీఐపీ దర్శనాలకు ఒకరోజు ముందుకు తప్పసరిగా ఆలయ అధికారుల అనుమతి తీసుకోవాలని  తమిళనాడు ఎండోమెంట్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆలయాల్లో సెల్ ఫోన్ల వాడకంపై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరింది.  

 ఆలయాల్లో వీఐపీ దర్శనాలతో సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి..విఐపీ దర్శనానికి సంబంధించి ఆలయ అధికారులకు కనీసం ఒకరోజు ముందుగా తెలియజేయాలని, తద్వారా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవచ్చని ఎండో మెంట్ శాఖ జీవో జారీ చేసింది. 

ఆలయాల లోపల విఐపిలతో పాటు భద్రత, నియమాలు పాటించేందుకు అవసరమైన అధికారులు, సిబ్బంది మాత్రమే ఉండాలని ఆ శాఖ ఆదేశించింది. వారి కదలికలు ఏ విధంగానూ భక్తులకు ఆటంకం కలిగించకూడదని హెచ్చరించింది. 

ALSO READ : కెనడాలో RSSపై నిషేధం.. మోహన్ భగవత్ ఎంట్రీని అడ్డుకోవాలని ఎంపీల లేఖ

మరో ఉత్తర్వులో.. భక్తులు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకం నిషేధించాలని ఆదేశించింది. ఆలయాల లోపల భక్తులు ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం, సెల్ఫీలు తీసుకోవడం, రీల్స్ తయారు చేయడం వంటివి చేస్తూ, ఆలయ ప్రాంగణం పవిత్రతకు, ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించకుండా చూడాలని ఆదేశించింది.  మొబైల్ ఫోన్ల వాడకం నిషేధించబడిందని భక్తులకు తెలియజేసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని ఆలయాలను కోరారు.