దేశ స్వప్నాన్ని యువత సాకారం చేస్తుంది: ప్రధాని మోదీ

దేశ స్వప్నాన్ని యువత సాకారం చేస్తుంది: ప్రధాని మోదీ

దేశ స్వప్నాన్ని యువత సాకారం చేస్తుందన్నారు ప్రధాని మోదీ. జీవితం చాలా పరీక్షలు పెడుతోంది.. అన్నింటిలో నెగ్గాలి.. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న లక్ష్యం సాధించాలని యువతకు మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IITఢిల్లీ) 57వ ఐఐటీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలు ప్రదానం చేశారు.

డిగ్రీ పొందడం అంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.. ఇది ఒక్కరోజుతో వచ్చేది కాదు.. ఎన్నో పరీక్షలు, తరగతుల తర్వాత వచ్చేది అని గుర్తు చేశారు. జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.. వాటి పట్ల వెనకడుగు వెయ్యకూడదు అని మోదీ విద్యార్థులకు ధైర్యం చెప్పారు. 

2026 ఆగస్టు 8న(శనివారం) ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT ఢిల్లీ) 57వ స్నాతకోత్సవంలో  ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 వేలమందికిపైగా పట్టాలు అందించారు. వారితో ముచ్చటించారు. వీరిలో 587 మంది Ph.D. పరిశోధకులు కూడా ఉన్నారు.