2027 ఐసీసీ మెన్స్ వన్డే ప్రపంచ కప్‌కు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న పొరుగు దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా చారిత్రాత్మక టీ20 (T20I) ముక్కోణపు సిరీస్‌లో తలపడటానికి సిద్ధమయ్యాయి. నమీబియా రాజధాని విండ్‌హోక్ వేదికగా ఆగస్టు 28వ తేదీన ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్, వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచ కప్‌కు అత్యంత కీలకమైన ముందస్తు సన్నాహకంగా నిలవనుంది. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ప్రపంచ కప్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి వస్తుండటంతో, ప్రాంతీయంగా క్రికెట్ ని మరింత బలోపేతం చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ సిరీస్ దోహదపడనుంది. అంతేకాదు, 2027 నుంచి ప్రారంభించనున్న సరికొత్త ఖండాల టోర్నమెంట్ ఆఫ్రికా కప్ కు కూడా ఈ ట్రై-సిరీస్ స్ట్రాంగ్ పునాది వేస్తుందని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఛైర్మన్ తవేంగ్వా ముకుహ్లానీ వెల్లడించారు.
వరల్డ్ కప్ కౌంట్‌డౌన్ స్టార్ట్:
ఈ టోర్నీ నిర్వహణపై మూడు దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
* దక్షిణాఫ్రికా క్రికెట్ (CSA) సీఈఓ ఫోలెట్సి మోసెకి: ఆఫ్రికా ఖండం వ్యాప్తంగా క్రికెట్ విస్తరణకు తమ కట్టుబాట్లను ఈ సిరీస్ చాటిచెబుతోందన్నారు. వరల్డ్ కప్‌కు ముందే అభిమానుల్లో ఇది సరికొత్త జోష్ నింపుతుందని పేర్కొన్నారు.
ALSO READ : ఇంటి స్థలం కోసం పంత్ ట్వీట్: దేవభూమికి పేరు తెచ్చిన మీకు సాయం చేస్తాం
* నమీబియా సీఈఓ జోహాన్ ముల్లర్: తమతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చిన దక్షిణాఫ్రికా, జింబాబ్వే బోర్డులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ భాగస్వామ్యం ఆఫ్రికన్ క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని వ్యాఖ్యానించారు.
* 2027 అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం ఐసీసీ ఇప్పటికే 3 దేశాల వ్యాప్తంగా 12 వేదికలను ఖరారు చేసింది. కాగా, ఐసీసీ సీనియర్ ప్రపంచ కప్ మ్యాచ్‌లకు నమీబియా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ట్రై -సిరీస్ షెడ్యూల్:
* ఆగస్టు 28: దక్షిణాఫ్రికా Vs నమీబియా విండ్‌హోక్
* ఆగస్టు 29: దక్షిణాఫ్రికా Vs జింబాబ్వే విండ్‌హోక్
* ఆగస్టు 31: జింబాబ్వే Vs నమీబియా విండ్‌హోక్
* సెప్టెంబర్ 1: జింబాబ్వే Vs దక్షిణాఫ్రికా విండ్‌హోక్
* సెప్టెంబర్ 3: నమీబియా Vs జింబాబ్వే విండ్‌హోక్
* సెప్టెంబర్ 4: నమీబియా Vs దక్షిణాఫ్రికా విండ్‌హోక్
* సెప్టెంబర్ 6: ఫైనల్ (టాప్-2 జట్లు) విండ్‌హోక్
The #CWC27 hosts are ready to lock horns in a momentous tri-series to set the stage for next year’s tournament 🏆 https://t.co/KFFjJQ6AgP
— ICC (@ICC) August 7, 2026
