సండే స్పెషల్ : చికెన్ మెజెస్టిక్.. ప్రాన్స్ పకోడి.. భలే టేస్ట్..

సండే స్పెషల్ :   చికెన్ మెజెస్టిక్.. ప్రాన్స్ పకోడి.. భలే టేస్ట్..

ఎప్పుడూ ఒకే వెరైటీ అంటే తినడానికి బోర్​ కొడుతుంది.  పిల్లలు  కొత్త రుచులంటే   ఎగిరి గంతేస్తారు.  సండే రోజె వెరైటీ ఫుడ్​ కోసం ఎదురుచూస్తుంటారు.  అందుకే చాలా మంది సండే స్పెషల్​ ఏంటని అడుగుతుంటారు కూడా.  అందుకే ఈ సండే రోజె వెరైటీగా చికెన్​ మెజెస్టిక్​.. ప్రాన్స్​ పకోడి ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

చికెన్ మెజెస్టిక్ తయారీకి కావాల్సినవి 

  • బోన్​లెస్ చికెన్ – పావు కిలో
  • నూనె, ఉప్పు – సరిపడా
  • మిరియాల పొడి – అర టీస్పూన్
  •  అల్లం వెల్లుల్లి పేస్ట్ – ముప్పావు టీస్పూన్
  •  మొక్కజొన్న పిండి,  పెరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు
  •  కోడిగుడ్డు – ఒకటి
  •  వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి – ఐదు
  •  కరివేపాకు, కొత్తిమీర – కొంచెం
  •  పసుపు, కారం, ధనియాల పొడి – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున

చికెన్ మెజెస్టిక్ తయారీ విధానం  :  ఒక గిన్నెలో చికెన్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్డు వేసి కలిపి అరగంట పక్కన పెట్టాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి అందులో చికెన్​ వేగించాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి ఒక్కోటిగా వేస్తూ వేగించాలి. ఉప్పు, సోయాసాస్​, వేగించిన చికెన్​ ముక్కలు వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు చల్లాక ఒక నిమిషం కలుపుతూ వేగిస్తే రెస్టారెంట్ స్టైల్​లో ఉండే హైదరాబాదీ చికెన్ మెజెస్టిక్స్ రెడీ. 

ALSO READ : కష్టాలను కలుపు మొక్కల్లా ఏరేయాలి.. అప్పుడే అనుకున్నది సాధిస్తాం..!

ప్రాన్స్ పకోడి తయారీకి కావాల్సినవి :

  • రొయ్యలు – అరకిలో
  • ఉప్పు – సరిపడా
  • పసుపు – పావు టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
  • గరం మసాలా – అర టీస్పూన్
  • కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • కొత్తిమీర – కొద్దిగా
  • పచ్చిమిర్చి – రెండు
  • నిమ్మరసం – ఒక టీస్పూన్
  • నూనె – రెండు టీస్పూన్లు
  • మొక్కజొన్న పిండి – రెండు టేబుల్ స్పూన్లు
  • శనగపిండి, బియ్యప్పిండి – ఒక్కోటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ చొప్పున 

ప్రాన్స్ పకోడి తయారీ  విధానం : ఒక గిన్నెలో రొయ్యలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, నూనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మొక్కజొన్న పిండి, శనగపిండి, బియ్యప్పిండి కలపాలి. కొంచెం నీళ్లు పోస్తూ కలపాలి. గంట నుంచి దాదాపు మూడు గంటలపాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి, అందులో రొయ్యల్ని ఒక్కోటిగా వేసి తక్కువ మంట మీద వేగించాలి.