MS Dhoni: ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగానే ఔట్ అయిపోయారు.. 259 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టేడియంలో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్ మొహాల్లో ఆందోళన, గుండెల్లో దడ స్టార్ట్ అయింది. సరిగ్గా అదే సమయంలో బ్రాడ్‌కాస్టర్ కెమెరా ఒక్కసారిగా విఐపీ స్టాండ్స్ వైపు తిరిగింది. మైదానంలో జరుగుతున్న మ్యాచ్ టెన్షన్ కంటే, అక్కడ ఉన్న ఒక ప్రత్యేక వ్యక్తి చేసిన కొంటేపనిని చూసిన అభిమానులంతా తమ బాధను మర్చిపోయి తెగ సంతోష పడుతున్నారు.
కట్ చేస్తే... స్టాండ్స్‌లో కనిపించిన సూపర్ స్టార్:
అవును, మీరు ఊహించింది కరెక్టే! అక్కడ కూర్చుని మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నది మరెవరో కాదు.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా, తలా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ దృశ్యం మరోసారి నిరూపించింది. 45 ఏళ్ల వయసులోనూ కేవలం ఒక్క చూపుతో సోషల్ మీడియాను షేక్ చేయడం ధోనీకి మాత్రమే సాధ్యం!.
►ALSO READ | హ్యాండిచ్చిన రోహిత్, కోహ్లీ.. భారత్కి మైండ్ బ్లాకింగ్ షాక్!
కెప్టెన్ కూల్ పెద్ద మనసు:
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఈ తొలి వన్డే మ్యాచ్‌కు ధోనీ హాజరయ్యారు. భారత్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ధోనీ స్టాండ్స్‌లో చాలా క్యాజువల్‌గా కూర్చుని చిప్స్ తింటూ మ్యాచ్ చూస్తున్నారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఒక చిన్నారి కూర్చుని ఉంది. తన చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్‌ను చూసిన ధోనీ... ఏమాత్రం బేషజాలు పోకుండా, ఎంతో పద్ధతిగా ఆ చిన్నారికి చిప్స్ ఆఫర్ చేశారు. ఆ పాప కూడా అంతే ముద్దుగా నవ్వుతూ వాటిని తీసుకుంది. అనంతరం ఇద్దరూ కలిసి మ్యాచ్ చూస్తూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్యూట్ అండ్ స్వీట్ మూమెంట్‌ను పక్కనే ఉన్న ప్రేక్షకులు చూసి తెగ మురిసిపోయారు.
నెట్టింట వీడియో హల్‌చల్:
ఈ అందమైన క్షణాన్ని కెమెరాతో బంధించిన స్టార్ స్పోర్ట్స్, ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఆలస్యం.. నిమిషాల్లోనే అది వైరల్ అయింది. మైదానంలో ఎంతమంది స్టార్లు ఉన్నా.. ధోనీ సింప్లిసిటీ ముందు ఎవరైనా సాటిరావాల్సిందే. ఆయన వికెట్ల వెనుక ఎంత కూల్‌గా ఉంటారో, మైదానం వెలుపల కూడా అంతే డౌన్-టు-ఎర్త్ ఉంటారని నెటిజన్స్ క్రీజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.
Safe to say, this kid has the best 'guess who I sat next to' story ever. 😎🤩#ENGvIND 1st ODI 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/xsm27mbXsE
— Star Sports (@StarSportsIndia) July 14, 2026
