ఇంట్లో పవర్ సాకెట్లు తక్కువగా ఉన్నాయా.. ? మీకోసమే ఈ మల్టీ ప్లగ్ అడాప్టర్

ఇంట్లో పవర్ సాకెట్లు తక్కువగా ఉన్నాయా.. ? మీకోసమే ఈ మల్టీ ప్లగ్ అడాప్టర్

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాకెట్లు తక్కువగా ఉండి.. వాడే గాడ్జెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ మల్టీ ప్లగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడాప్టర్ బాగా ఉపయోగపడుతుంది. ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ దీన్ని మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. వీటి వల్ల ఆఫీసులో, ఇంట్లో గోడకు పెట్టాల్సిన స్విచ్ బోర్డుల సంఖ్యను కూడా తగ్గించుకోవచ్చు. దీన్ని సాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, దీని ద్వారా మరో మూడు గాడ్జెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పవర్ అందించొచ్చు. 

దీనికి మూడు వైపులా పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాకెట్లు ఉంటాయి. ఒకవైపు మాత్రం వాటిని ఆపరేట్ చేసేందుకు మూడు స్విచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. ప్రతి స్విచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.  స్విచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినప్పుడు లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలుగుతుంది. ఇందులో ఫ్యూజ్ కూడా ఉంటుంది. దీనివల్ల ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినప్పుడు గాడ్జెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై ఆగిపోతుంది. ఇది కాంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. 

ధర:​ రూ. 298


గ్రాబర్ టూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ఎత్తైన షెల్ఫ్​ల్లో ఉన్న వస్తువులని స్టూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా నిచ్చెన వేసుకుని ఎక్కి తీస్తుంటాం. కానీ.. ఈ గ్రాబర్ టూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అలాంటివాటిని స్టూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండానే ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈఎంజెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. దీనికి ఒకవైపు రెండు దవడలు, మరోవైపు హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉండే బటన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దవడలను ఆపరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. వాటి సాయంతో మంచం కింద, ఎత్తైన అల్మరా లాంటి చెయ్యి చేరుకోలేని ప్రదేశాల్లోని వస్తువులను తీయొచ్చు. 

►ALSO READ | మూషి తెలివి.. మంచి ఉపాయం.... ఎంతటి ప్రమాదాన్నైనా తప్పిస్తుంది

కాయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్వలప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చెత్త, మెటల్, గాజు వస్తువులను కూడా ఇది సులభంగా పట్టుకుంటుంది. పట్టుకునే దవడలను 360 డిగ్రీల వరకు ఎటువైపైనా తిప్పుకోవచ్చు. పైగా యాంటీ స్లిప్ మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూత ఉండటం వల్ల మృదువైన వస్తువులను కూడా పట్టుకోగలుగుతుంది. దీని పొడవును అడ్జస్ట్ చేసుకోవచ్చు. వయసుపైబడినవాళ్లకు, వికలాంగులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మన్నికైన, తేలికైన అల్యూమినియం మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీపీ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారుచేశారు. ప్యాడెడ్ యాంటీ–స్లిప్ హ్యాండిల్ చేతిలో బాగా ఇమిడిపోతుంది. 

ధర:​ రూ. 698