Sreeleela: ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్తో ‘పడ్డానండీ ప్రేమలో మరి’.. శ్రీలీల లవ్ జర్నీ స్టార్ట్ అయిందా?

Sreeleela: ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్తో ‘పడ్డానండీ ప్రేమలో మరి’.. శ్రీలీల లవ్ జర్నీ స్టార్ట్ అయిందా?

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె యువ క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు శ్రీలీల కానీ, తిలక్ వర్మ కానీ స్పందించలేదు. అలా అని ఖండించనూ లేదు. ఈ క్రమంలోనే ఇవి కేవలం పుకార్లేనా? లేక నిజమా? అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. అయితే, ప్రతి పుకారులోనూ శ్రీలీల పేరు కచ్చితంగా ఉండాల్సిందేనా అని మరికొందరు ట్వీట్స్ పెడుతున్నారు. మరోవైపు, శ్రీలీల సన్నిహితులు మాత్రం ఇవన్నీ కేవలం పుకార్లేనని, ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని చెబుతున్నారు.

రూమర్స్ వినిపించడానికి కారణాలు..

శ్రీలీల-తిలక్ వర్మ మధ్య ప్రేమ మొదలైందంటూ వార్తలు రావడానికి కారణాలు ఇవే అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొదట డిసెంబర్ 2025లో, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీలీల తన కుటుంబంతో వెళ్ళింది. ఈ సమయంలోనే, యాదృచ్ఛికంగా తిలక్ వర్మ కూడా తన ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉన్నారు. 

రెండవది, ఇటీవల ధర్మశాలలో, ముంబై ఇండియన్స్–పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ స్టేడియంలో కనిపించారని ప్రచారం జరిగింది. ఓ ఫోటో కూడా వైరల్ అవుతుంది.

ఆ తర్వాత శ్రీలీల కూడా కొన్ని మ్యాచ్‌లకు హాజరైందని, ఆమె టీమ్‌కు చెందిన వ్యక్తి ‘తిలక్’ అని ఉన్న జెర్సీ ధరించాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా, టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కూడా శ్రీలీల కనిపించినట్లు ప్రచారం జరిగింది. 

►ALSO READ | Kattalan Trailer Review: ‘కాటాలన్’ ట్రైలర్ గూస్‌ బంప్స్.. ఏనుగు దంతాల మాఫియాపై వైల్డ్ యాక్షన్

లేటెస్ట్గా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌తో తిలక్‌ కలిసి ఉన్న ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో తిలక్ వర్మ హోటల్ లాబీలో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నడుస్తూ కనిపిస్తాడు. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ సరదాగా అతడిని "ప్రేమలో ఉన్నావు" అంటూ ఆటపట్టించినట్లు వినిపిస్తుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ విషయాన్ని శ్రీలీలతో లింక్ చేస్తున్నారు. అయితే సూర్యకుమార్ ఎక్కడా శ్రీలీల పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ వీడియో తెగ వైరల్ అవుతుంది.

ఈ కారణాలే వీరిమధ్య వస్తున్న రూమర్లకు బలం చేకూర్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు తిలక్ వర్మ, శ్రీలీల ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే,   శ్రీలీల తల్లి ఒక మ్యాచ్‌కు హాజరయ్యారని లేదా ఒకే చోట కనిపించారని మాత్రమే, వారి మధ్య ఏదో ప్రేమ సంబంధం ఉందనేది కరెక్ట్ కాదని నటి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, కనీసం సరైన సంబంధం కూడా లేకపోయినా.. ఇలాంటి ఊహాగానాలను "డేటింగ్ పుకార్లు"గా ప్రచారం చేయడం తగదని సూచిస్తున్నారు.

ఒట్టి ఊహాగానాలేనా..!

తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ ఆటగాళ్లలో ఒకరు కావడం, మరోవైపు శ్రీలీలకు తెలుగులో భారీ అభిమాన వర్గం ఉండటంతో ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో త్వరగానే హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ప్రత్యేక బంధం ఉందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకోవడం ప్రారంభించారు.

ఈ రూమర్స్కి మరింత ఊతమిస్తూ, సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య  కొన్ని కార్యకలాపాలు కూడా జరిగినట్లు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఒకరినొకరు ఫాలో అవడం, తర్వాత అన్‌ఫాలో చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే అనే టాక్ వినిపిస్తుంది.

బాలీవుడ్ యంగ్ హీరోతో రిలేషన్!

ఇదిలా ఉంటే, ఇన్నాళ్లు శ్రీలీల ఓ యంగ్ హీరోతో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అయింది. పలుమార్లు వీరిద్దరూ కలిసి ఈవెంట్స్, పార్టీస్, ఫెస్టివల్స్ వంటివి సెలబ్రేట్ చేసుకోవడంతో కన్ఫమ్ అనేలా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ముంబైలోని కార్తిక్ ఆర్యన్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ లో కూడా శ్రీలీల పాల్గొంది. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా అటెండ్ అయ్యింది. ఈ క్రమంలోనే శ్రీలీల-కార్తీక్ కలిసి చవితి సెలబ్రేట్ చేసుకోవడం వీరి మధ్య రూమర్స్ మరింత ట్రెండ్ అయ్యాయి.

ఇపుడు కొత్తగా హైదరాబాదీ యంగ్ క్రికెటర్ అయిన తిలక్ వర్మతో శ్రీలీల ప్రేమలో పడిందంటూ టాక్ సినీ వర్గాల్లో మొదలైంది. అయితే, ఈ విషయంపై శ్రీలీల స్పందిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే, శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.