నాని నటన చాలా ఇష్టం ఆయనే నా ఫేవరెట్: ముత్తయ్య మురళీధరన్

నాని నటన చాలా ఇష్టం ఆయనే నా ఫేవరెట్: ముత్తయ్య మురళీధరన్

ప్రముఖ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan) జీవిత కథ ఆధారంగా 800(800 Movie) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎంఎస్ శ్రీపతి(MS Sripathi) తెరకెక్కిస్తున్నఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో మధూర్ మిట్టల్(Madhur mittal) నటిస్తుండగా.. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇప్పటికే 800 నుండి రిలీజైన ట్రైలర్, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ ముత్తయ్య మురళీధరన్, హైదరాబాది క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

ALSO READ | ఆర్జీవీ కంట్లో పడిన ఈ అమ్మాయి ఎవరు?


ఈ సందర్బంగా ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరో నాని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను ఇంతకుముందు హీరో నానిని కలిసినప్పుడు తనంటే అభిమానం అని చెప్పలేదు. ఇండియాలో చాలా మంది యాక్టర్స్ అద్భుతంగా సినిమాలు చేస్తున్నారు. వారిలో నాకు నాని నటన బాగా నచ్చుతుంది. ఆయనే నా ఫేవరేట్. ఆయన నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది. యాక్షన్ కంటే డ్రామా, ఎమోషన్స్ ఎక్కువ వాల్యూ ఇస్తారు నాని. ఆయన నటించిన శ్యామ్ సింగరాయ్, జెర్సీ, ఈగ.. ఇంకా చాలా సినిమాలు చూశాను అని చెప్పుకొచ్చారు మురళీధరన్. ప్రస్తుతం హీరో నానిపై ముత్తయ్య మురళీధరన్ చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నాని ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన హాయ్ నాన్న అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్  ఎమోషనల్ ఎంటర్టైనర్ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.