క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి రోజు ఏదోరకమైన పోస్ట్లు పెడుతూ అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే?
రాం గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేశారు. ఎల్లో కలర్ శారీలో, చేతిలో కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తూ కనిపించింది ఆ అమ్మాయి. ఈ వీడియోను పోస్ట్ చేసి..
ALSO READ : శ్రీరామ్ సాగర్లోకి భారీగా వరద.. 9 గేట్లు ఎత్తివేత
వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పాలంటూ నెటిజన్స్‌ను ప్రశ్నించారు. దానికి నెటిజన్స్ నుండి కూడా క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి.
Can someone tell me who she is ? pic.twitter.com/DGiPEigq2J
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2023
అయితే ఆర్జీవీ పోస్ట్ చేసిన ఈ వీడియోలోని అమ్మాయి ఎవరు అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది. కొందరు మాత్రం ఆమె పేరు శ్రీలక్ష్మి సతీశ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ ఆ అమ్మాయి గురించి ఎందుకు అడిగాడు అనేది కూడా ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది.