Naga Chaitanya: తండేల్ వాలెంటైన్స్ డే స్పెషల్..బుజ్జితల్లే వచ్చేత్తున్నా కదే

Naga Chaitanya: తండేల్ వాలెంటైన్స్ డే స్పెషల్..బుజ్జితల్లే వచ్చేత్తున్నా కదే

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి (Chandu mondeti) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ తండేల్(Thandel). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా..నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. 

ఇవాళ (ఫిబ్రవరి 14) వాలెంటైన్స్ డే స్పెషల్గా చై..సాయిపల్లవి రీల్స్ చేశారు. ప్రతిరోజు ప్రేమను ప్రేమగా జరుపుకోండి అంటూ ఆడియన్స్కు స్పెషల్ వీడియోతో విషెస్ తెలిపారు. బుజ్జితల్లే..వచ్చేత్తున్నా కదే..కాస్తా నవ్వవే..అనే డైలాగ్తో వీడియో చేశారు. ప్రేమికుడి కోసం ఎదురుచూస్తున్న ప్రియురాలి మనసుకి హత్తుకునే మాటతో చై కనిపిస్తుండగా..మనసులో అలక..కళ్ళల్లో దాగిన కన్నీరు..నువ్వు లేకుండా ఎక్కువ కాలం ఉండలేను..అనేలా సాయిపల్లవి క్యూట్ మూమెంట్స్ భలేగా ఉన్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి అమీర్ ఖాన్ కొడుకుతో ఓ మూవీ చేస్తూ జపాన్లో ఉంది.అక్కడ్నించే వీడియో చేసింది. 

తండేల్ మూవీ విషయానికి వస్తే..రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. గుజరాత్‌ లోని సూరత్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

బోటు నడిపే వ్యక్తి బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లగా..అలా సముద్రవేట లో ఉంటూ పాకిస్థాన్‌ కోస్టుగార్డుల చెరలో చిక్కుతాడు. అలా అక్కడి పాకిస్థాన్ జైలు నుంచి..తాను ప్రేమించిన వాడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.