పెట్రోల్ బంక్లో నాగచైతన్య.. స్పోర్ట్స్ కారులో సిటీలో చక్కర్లు

పెట్రోల్ బంక్లో నాగచైతన్య.. స్పోర్ట్స్ కారులో సిటీలో చక్కర్లు

అక్కినేని హీరో నాగ చైతన్య(Naga chaitanya) పెట్రోల్‌ బంక్‌ కనిపించి సందడి చేశారు. తన ఖరీదైన ఫెరారీ కారులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారు. దీంతో అవాకైనా ఫ్యాన్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడీయో కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోలో నాగ చైతన్య వచ్చిన కారుపై అందరి దృష్టిని ఆకర్షించింది. రెడ్ కలర్ లో ఉన్న ఈ ఫెరారీ కారు ధర దాదాపు రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :- ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు

ఇక అక్కినేని నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కార్తికేయ(Karthikeya) ఫేమ్ చందు మొండేటి(Chandu mondeti) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్(Geetha arts) సంస్థఫై అల్లు అరవింద్(Allu aravind) నిర్మిస్తున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai pallavi) హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కస్టడీ మూవీతోప్లాప్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో హిట్ అందుకుంటాడా చూడాలి.