ఫ్యాన్స్ పండగ : ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు

ఫ్యాన్స్ పండగ : ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు

మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej) ఓ ఇంటివాడయ్యారు. నవంబర్ 1న తాను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి(lavanya tripati) మెడలో మూడు ముళ్ళు వేసి బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి పలికారు. ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లివేడుకకు మెగా ఫ్యామిలీ(Mega family), అల్లు ఫ్యామిలీ(Allu family), లావణ్య త్రిపాఠి ఫ్యామిలీతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read :- OTTలో ఒకేరోజు రెండు క్రేజీ సినిమాలు

అయితే ఆ ఫోటోలలో ఒక ఫోటోకు మాత్రం అటు మెగా ఫ్యాన్స్, ఇటు నార్మల్ ఆడియన్స్  ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలో మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.  వరుణ్ తేజ్ లావణ్య మేడలో తాళి కట్టిన తరువాత కొత్త జంటతో.. మెగా ఫ్యామిలీ హీరోలందరూ కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫొటోలో.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjevi), పవన్ కళ్యాణ్(Pawan kalyan), నాగబాబు(Nagabau), రామ్ చరణ్(Ram charan), అల్లు అర్జున్(Allu arjun), సాయి ధరమ్ తేజ్(Sai dharam tej), అల్లు శిరీష్(Allu shirish), వైష్ణవ్ తేజ్(Vaishnav tej) ఉన్నారు. మెగా హీరోలందనీ ఒకే ఫ్రేమ్ లో ఇలా చూసేసరికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.