ఆడియన్స్ గెట్ రెడీ.. OTTలో ఒకేరోజు రెండు క్రేజీ సినిమాలు

ఆడియన్స్ గెట్ రెడీ.. OTTలో ఒకేరోజు రెండు క్రేజీ సినిమాలు

ఓటీటీ(OTT)లో వారవారం కొత్త కంటెంట్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంటోంది. అందులో భాగంగానే ఈ వారం కూడా రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసాయి. అందులో షారుఖ్ ఖాన్(Sharukh khan) హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్(Jawan) కాగా.. రెండోది రామ్(Ram) హీరోగా వచ్చిన మాస్ మసాలా మూవీ స్కంద(Skanda). ఈ రెండు సినిమాలు నవంబర్ 2న ఓటీటీలో వచ్చేసాయి. మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది వివరాలు మీకోసం.

ముందుగా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ జవాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.  నవంబర్‌ 2 షారుక్ పుట్టినరోజు సందర్భంగా జవాన్ ఓటీటీలో రిలీజ్‌ కానుంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించిన ఈ సినిమాలో.. నయనతార, దీపికా పదుకోన్‌, విజయ్‌ సేతుపతి వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. మరి థియేటర్ లో ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంటర్టైన్ అవ్వండి.   

Also Read :- మిడిల్ క్లాస్ బయోపిక్

 
రెండవది ఉస్తాద్ హీరో రామ్‌ పోతినేని, యంగ్‌ బ్యూటీ శ్రీలీల జంటగా వచ్చిన స్కంద. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిచిన ఈ మూవీ సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను థియేటర్స్ లో చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.  తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌ లో   ఎంట్రీ ఇచ్చేసింది స్కంద. నవంబర్ 2 నుండి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.