Thandel Movie: తండేల్ తీరప్రాంతపు షెడ్యూల్ అప్డేట్..మత్స్యకారుడిగా చైతన్య కొత్త స్టిల్స్

Thandel Movie: తండేల్ తీరప్రాంతపు షెడ్యూల్ అప్డేట్..మత్స్యకారుడిగా చైతన్య కొత్త స్టిల్స్

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి (Chandu mondeti) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ తండేల్(Thandel). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా..నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ మేరకు ఈ సినిమా షూటింగ్ ఉడిపి సహా అనేక ప్రాంతాల్లో జరుపుకుంది. దీంతో తండేల్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ ఫొటోస్ రిలీజ్ చేశారు. అందమైన లొకేషన్స్ లలో పలు కీలకమైన సన్నివేశాలను ఓడరేవు..వాటి తీరప్రాంతపు గ్రామాలలో చిత్రీకరించినట్లు తెలిపారు. కొత్త షెడ్యూల్ అప్డేట్ను త్వరలో ప్రకటిస్తామని పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ ఫస్ట్ షెడ్యూల్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ‘తండేల్’ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ అని..త్వరలోనే మరికొన్ని ఎక్సయిటింగ్ అప్‌‌‌‌డేట్‌‌‌‌లతో రానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రాన్నికి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తండేల్ అంటే..నాయకుడు, కెప్టెన్ అట. ఎలాంటి భయం, బెరుకు లేనివాడు అని అలాంటి యోధుడినే తండేల్ అంటరాని తెలుస్తుంది.అంతేకాకుండా శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం.మరి తండేల్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.