అనీష్ ఆర్ కృష్ణ డైరెక్షన్ లో హీరో నాగ శౌర్య ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి నేడు నాగ శౌర్య పుట్టిన రోజు (జనవరి 22) సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కృష్ణ వ్రింద విహారి అనే ఈ టైటిల్ ఎంతో ట్రెడిషనల్‌గా, కొత్తగా ఉంది. కృష్ణ, వ్రింద అనేవి హీరో హీరోయిన్ల పాత్రల పేర్లు అని తెలుస్తోంది. టైటిల్‌ను డిజైన్ చేసిన విధానం కూడా చక్కగా కుదిరింది.
ఈ పోస్టర్లో నాగ శౌర్య అందరినీ మెప్పించేలా ఉన్నారు. నిలువు బొట్టుతో బ్రాహ్మణుడిగా కనిపించారు. పోస్టర్ చూస్తుంటే పెళ్లి తంతులా ఉంది. మొత్తానికి పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.ఇప్పటివరకు నాగ శౌర్య చేసిన పాత్రలన్నింటి కంటే ఈ రోల్ డిఫరెంట్‌గా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య పూర్తిగా సరికొత్త పాత్రలో కనిపించబోతోన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. షిర్లే సెటియా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించారు.ఈ మూవీలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య వంటి కమెడియన్స్ ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. వారి క్యారెక్టర్స్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు, సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
It's a Crazy experience & #Krishna will be Loved by all! ❤️
— Naga Shaurya (@IamNagashaurya) January 22, 2022
Here's the First Look Poster
of #NS22 #IRA4 ?
✨ #??????????????????? ✨@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @mahathi_sagar @YEMYENES @ira_creations @UrsVamsiShekar pic.twitter.com/VHbemaEPFv