నేచురల్ స్టార్ నాని (Nani)తో దసరా (Dasara) లాంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకొని బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లు కొల్లగొట్టాడు ఈ కుర్ర దర్శకుడు. రీసెంట్ గా ఈ డైరెక్టర్ నాని తో మరో సినిమా అనౌన్స్ చేశాడు.
నాని 33వ సినిమాగా వస్తోన్నఈ మూవీకి సంబంధించిన ఒక కాస్టింగ్ కాల్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కున్న సినిమాలో అన్ని వయసులకు సంబంధించిన వారికి నటించే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే అందుకోసం మూడు ఫోటోలు, నిమిషం లోపు ఉన్న మూడు యాక్టింగ్ వీడియోలు ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఒక మెయిల్ కూడా చేయగలరని తెలిపారు. అలాగే " కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది..భీకర విప్లవం రూపుదిద్దుకుంటుంది.రండి, విప్లవంలో చేరండి..నానీ 33తో మీ గుర్తింపును కనుగొనండి" అంటూ ప్రకటించారు.
అంతే కాదు తమ సినిమాలో నటించాలి అనిఇంట్రెస్ట్ ఉన్నవారు..ఏడాది పాటు టైం కేటాయించే కమిట్మెంట్ ఉండాలని, ప్రతి నటుడు మరియు నటి ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్ కి సిద్ధంగా ఉండాలని వర్క్ షాప్స్ కి కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుందని తెలిపారు.అయితే ఇన్ స్టా రీల్స్ కానీ, టిక్ టాక్ వీడియోలు, సెల్ఫీ వీడియోలు పంపకూడదని అలాగే ఆఫీసుకు కూడా రాకూడదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం రెడీ అవ్వండి.
80 దశకంలో తెలంగాణలోని వ్యవస్థ, ఆ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఓ యువకుడు లీడర్ గా ఎలా ఎదిగాడు అనే కథతో ఈ సినిమా రానుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
A new chapter begins.
— SLV Cinemas (@SLVCinemasOffl) April 16, 2024
A fierce revolution takes shape.
Come, join the revolution and discover your identity with #Nani33 ?
Email your profiles to [email protected]
or Whatsapp the same to +91 8008690262
⭐️ing Natural Star @NameisNani
A @odela_srikanth cinema ❤️?… pic.twitter.com/h8LpYHc91I
