
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వెళ్లారు. ఇటీవల సల్మాన్ ఇంటివద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ను ఆయన కలిశారు. ఈ భేటీలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కూడా ఉన్నారు. భద్రతా ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. మహారాష్ట్రలో ఎలాంటి అండర్ వరల్డ్ కార్యకలాపాలను సహించేది లేదని సీఎం అన్నారు.
#WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9
— ANI (@ANI) April 16, 2024
2024 ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ల వెలుపల ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. ఆ టైమ్ లో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను విక్కీ గుప్తా, సాగర్‌పాల్‌గా గుర్తించారు. నిందితులిద్దరూ బీహార్‌లోని చంపారన్ జిల్లాకు చెందినవారు . సల్మాన్‌కి ఇంతకుముందు చాలాసార్లు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి