సంగారెడ్డి: పోచారం వద్ద ORR పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వెళుతున్న కారు అదుపుతప్పి ORR పై నుంచి సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నెహ్రూ జూ పార్క్ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఈ కారులో ఉన్న వాళ్లు మేడ్చల్ మల్కా్జ్ గిరి జిల్లా బోరంపేటకు చెందిన హరి ప్రసాద్ కుటుంబ సభ్యులుగా తెలిసింది. కుటుంబంతో కలిసి జూ పార్క్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇందులో హరిప్రసాద్ భార్య మౌనిక (36), నవీన్ (30).. ఈ ఇద్దరూ చనిపోయారు. గాయపడిన హరి ప్రసాద్, శ్రీహర్ష, అమృత, సుశ్రుతను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఏడాదిన్నర వయసున్న పిల్లాడు అగస్త్య కాలికి గాయమైంది.
