గడచిన మూడు రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు వారాంతంలో తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల రాజకీయ, ఆర్థిక వాతావరణం తిరిగి నెలకొంటున్న వేళ ఉద్రిక్తతలు తగ్గటంతో గతంలో మాదిరిగా బంగారం, వెండి భారీగా ర్యాలీని కొనసాగించటం లేదు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతంలోని రేట్లను గమనించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
ఫిబ్రవరి 7న బంగారం రేట్లు కొద్దిగా పెరిగాయి. దీంతో ఫిబ్రవరి 6 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.289 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.15వేల 660గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 355గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : వడ్డీ రేట్లు మారలే.. 5.25 శాతం వద్దే రెపో రేటు
అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొన్ని రోజుల కిందటి వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం ఫిబ్రవరి 7, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.5 వేలు పెరిగి రూ.2లక్షల 85వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.285 వద్ద ఉంది.
