దండేపల్లి: టెన్త్ ఎగ్జామ్ రాసినా ఆబ్సెంట్‌‌‌‌‌‌‌‌ వేసిన్రు...న్యాయం చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసిన స్టూడెంట్‌‌‌‌‌‌‌‌

దండేపల్లి: టెన్త్ ఎగ్జామ్ రాసినా  ఆబ్సెంట్‌‌‌‌‌‌‌‌ వేసిన్రు...న్యాయం చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసిన స్టూడెంట్‌‌‌‌‌‌‌‌

దండేపల్లి, వెలుగు: టెన్త్‌‌‌‌‌‌‌‌ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సప్లిమెంటరీ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసినా ఆబ్సెంట్ అయినట్లు రిజల్ట్​ వచ్చింది.  దీనిపై స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ బుధవారం మంచిర్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీపక్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసింది. దండేపల్లి మండలకేంద్రానికి చెందిన సిద్ది అంజమ్మ ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసి మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌, సైన్స్‌‌‌‌‌‌‌‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అయింది. సప్లిమెంటరీ ఫీజు కట్టి పరీక్షలు రాసింది. 

కాగా ఇటీవల విడుదలైన సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫలితాల్లో మ్యాథ్స్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌కు గైర్హాజరయినట్లు కనిపించింది. దీంతో సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులతో కలిసి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేసింది.